BRS Politics : శంకర్ నాయక్ Vs కవిత : మానుకోట బీఆర్ఎస్ లో మళ్లీ భగ్గుమన్న వర్గపోరు

గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మానుకోట బీఆర్ఎస్ లో వర్గ పోరు మరోసారి బయటపడింది. కార్యకర్తల సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి కవిత వేదికపైనే వాగ్వాదానికి దిగారు. ఎంపీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ ఘటన హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.

New Update
BRS Politics : శంకర్ నాయక్ Vs కవిత : మానుకోట బీఆర్ఎస్ లో మళ్లీ భగ్గుమన్న వర్గపోరు

Mahabubabad : మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌లో(BRS Party) మరోసారి వర్గపోరు బయటపడింది. ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మధ్య మళ్లీ వార్‌ చోటు చేసుకుంది. కార్యకర్తల సమావేశంలోనే వేదికపై ఈ ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ రోజు కవిత(Kavitha) నామినేషన్‌ సందర్భంగా మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని సూచించారు శంకర్‌ నాయక్‌. దీంతో శంకర్‌నాయక్‌ నుంచి ఎంపీ కవిత మైక్ తీసుకున్నారు. తనను మాట్లాడినవ్వకపోవడంపై శంకర్‌ నాయక్‌ తీవ్ర ఆగ్రహం చేశారు. తేల్చుకుందామా? అంటూ వేదికపైనే నేతల్ని ప్రశ్నించారు శంకర్‌ నాయక్‌. సీనియర్లు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు ఈ మాజీ ఎమ్మెల్యే.
ఇది కూడా చదవండి: Loksabha Elections 2024: హాట్‌టాపిక్‌గా కొండా అఫిడవిట్.. ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?

2014 తర్వాత మొదలైన వర్గపోరు..
మాజీ మంత్రి రెడ్యా నాయక్ కూతురైన మాలోత్ కవిత 2009లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2014లో మరో సారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కవితపై పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత తన తండ్రి, అప్పటి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి టీఆర్ఎస్ లో చేరారు కవిత. అప్పటి నుంచి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో వర్గపోరు స్టార్ట్ అయ్యింది.

2018లో మొదలైన వర్గపోరు.. 
2018లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఈ ఇద్దరు తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే.. శంకర్ నాయక్ కే అవకాశం ఇచ్చారు కేసీఆర్. కవితను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించారు.  అయినా.. ఆధిపత్య పోరు మాత్రం ఆగలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి పోటీకి దిగిన శంకర్ నాయక్ ఓటమిపాలయ్యారు.

అయితే.. కవిత తనకు సపోర్ట్ చేయకపోవడం కారణంగానే ఓటమి పాలయ్యానన్నది శంకర్ నాయక్ వాదన. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కవిత మరో సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరి మధ్య వర్గపోరు తాజాగా బయటపడింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల్లో శంకర్ నాయక్ కవితకు ఏ మేరకు సపోర్ట్ చేస్తారోనన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు