TS BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ.. బీజేపీకి రాజాసింగ్ బిగ్ షాక్!

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్తి మాధవీలత నామినేషన్ కు ఆయన హాజరుకాలేదు. తద్వారా మాధవీలత అభ్యర్థిత్వంపై తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు రాజాసింగ్

New Update
TS BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ.. బీజేపీకి రాజాసింగ్ బిగ్ షాక్!

పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టారు. మాధవీలత పేరును హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా.. తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే మాధవీలత పేరును ఫైనల్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ విషయపై పార్టీ పెద్దలు సైతం రాజాసింగ్ తో చర్చలు జరుపుతూ వస్తున్నారు. అయినా రాజాసింగ్ శాంతించలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Anurag Singh Thakur: ఓవైసీ గోవులను కోసి తినమంటాడు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో ఆయన నామినేషన్ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ పొలిటికల్ ఇంఛార్జ్‌గా రాజాసింగ్ ఉన్నారు. కానీ.. ఇప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లోనూ ఆయన ప్రచారంలో పాల్గొంటారా? మాధవీలతకు మద్దతు ఇస్తారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు