Loksabha Election Notification : నేడే తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్... !

భారత్ లో 18 వ లోక్ సభ ఎన్నికల సందడి షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుంచే ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ బుధవారం వెలువడనుంది. మొదటి షెడ్యూల్‌ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.

New Update
Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

Election Notification : భారత్ లో 18 వ లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) సందడి షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుంచే ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌(Elections Notification) బుధవారం వెలువడనుంది. మొదటి షెడ్యూల్‌ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమౌతున్నట్లు అధికారులు వివరించారు.

ఈ నోటిఫికేషన్‌ వెలువడే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh), సిక్కిం(Sikkim), అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh), ఒడిశా(Odisha) అసెంబ్లీలతో పాటు లోక్‌సభ షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్‌ 19 న జరగనున్న తొలిదశ పోలింగ్‌ కు సంబంధించి నోటిఫికేషన్‌ బుధవారం వెలువడనుంది. ఈ నెల 27 వరకూ నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంటుంది.

30 వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది. తొలిదశ లోక్‌ సభ ఎన్నికల్లో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు లోని 39 స్థానాలకు తొలిదశలోనే పోలింగ్‌ జరగనుంది. మొత్తం 80 స్థానాలున్న యూపీలో 8 స్థానాలకు , మధ్యప్రదేశ్‌ 6, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ 5, మధ్యప్రదేశ్‌ 6 స్థానాకలు తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి.

బీహార్‌ లో 4, పశ్చిమ బెంగాల్ 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయలో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్‌గడ్‌, అండమాన్‌ , జమ్ము కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది.

Also Read : UPSC: 22ఏళ్లకే యూపీఎస్సీ సాధించిన..ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ!

లోక్‌సభ ఎన్నికల తొలి దశ షెడ్యూల్

మార్చి 20 ఎన్నకల నోటిఫికేషన్ విడుదల
మార్చి 20 నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతాయి
మార్చి 27 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
మార్చి 28 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
మార్చి 30 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.
ఏప్రిల్ 19 పోలింగ్(Poling) జరగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు