/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BJP-1-jpg.webp)
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. అధికార పార్టీలో చేరలేదన్నారు. తాను సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని అని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం మోడీ విజయం కోసం పనిచేస్తానన్నారు. సమ సమాజ స్థాపన కోసం మోడీ పని చేస్తున్నారని కొనియాడారు. కుట్రపూరితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. నేతకాని వెంకటేశ్ మాట్లాడుతూ.. రెండు నెలల 23 రోజులుగా తాను అశాంతితో కొట్టు మిట్టడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించడం తన అదృష్టం అని అన్నారు. మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ నాయకత్వం ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు.