Addanki Dayakar: అద్దంకి దయాకర్ కు మళ్లీ హ్యాండ్.. వారి కుట్రేనా?

ఇటీవల పార్టీలో చేరిన పసునూరి దయాకర్ కు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దీంతో అద్దంకి దయాకర్ వర్గంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అద్దంకి దయాకర్ కు అవకాశాలు రాకుండా కొందరు చేస్తున్న కుట్రలో ఇది భాగమని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Addanki Dayakar: అద్దంకి దయాకర్ కు మళ్లీ హ్యాండ్.. వారి కుట్రేనా?

దాదాపు పదేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) గొంతుకను బలంగా వినిపించిన అద్దంకి దయాకర్ కు (Addanki Dayakar) మరో సారి హైకమాండ్ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీగా (Warangal MP) ఆయనకు అవకాశం కల్పిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అద్దంకితో పాటు పలువురు కీలక నేతలు సైతం హైకమాండ్ ఈ మేరకు ఆలోచిస్తోందని అనేక సార్లు తెలిపారు. తాజాగా వరంగల్ ఎంపీ స్థానికి పసునూరి దయాకర్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ తెరపైక తేవడంతో అద్దంకి అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన అద్దంకి దయాకర్ ను పక్కకుపెట్టి.. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన పసునూరికి టికెట్ ఎలా ఇస్తారంటూ వారు మండిపడుతున్నారు. గతంలో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ విషయంలోనూ ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా పదవి విషయంలోనూ చివరి నిమిషయంలో అద్దంకి పేరును తొలగించారు. దీంతో అద్దంకికి వరుస అవమానాలు జరుగుతున్నాయన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ సర్కార్ షాక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ఆ పెద్దల పనేనా?
అద్దంకి దయాకర్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలువురు సీనియర్ నేతలతో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నేతలంతా కీలకంగా మారడంతో అద్దంకికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న వాదన వ్యక్తం అవుతోంది. ఆ నేతలంతా అద్దంకికి అవకాశాలు రాకుండా అడుగడుగునా అడ్డుపుతున్నారని ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా..?
ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ లోక్ సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. అక్కడి నుంచి అద్దంకిని పోటీకి దించుతారన్న ప్రచారం మొదలైంది. అయితే.. లాస్య నందిత కుటుంబ సభ్యులనే అక్కడ బీఆర్ఎస్ బరిలో దించే అవకాశం ఉంది. సానుభూతి పని చేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బలి చేసేందుకే అద్దంకిని పోటీకి దించే ప్రయత్నం సాగుతోందన్న వాదన కూడా ఆయన వర్గీయుల్లో వినిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు