48 గంటల్లో నామినేషన్ల గడువు ముగియనున్నా.. ఇంత వరకు తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) టికెట్ల పంచాయితీ తేలలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు హస్తం పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో శ్రేణులతో పాటు టికెట్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో నామినేషన్లకు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉంది. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గరు మంత్రులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమ వారికే ఇప్పించుకోవాలని వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రచారంలో రేవంత్ దూకుడు..నేడు పాలమూరు పర్యటన
అయితే టికెట్ తుది రేసులో రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వర రావు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్ల్ చర్చ సాగుతోంది. ఖమ్మం టికెట్ ను ఫైనల్ చేసేందుకు ఇప్పటికే మంత్రులు భట్టి, పొంగులేటితో ఏఐసీసీ చీఫ్ ఖర్గే భేటీ అయ్యారు. అయితే.. కరీంనగర్ లో మాత్రం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హాజరుకావడంతో ఆయనకు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్ ఎంపీ రేసులో సమీర్ వలీవుల్లా ఉన్నారు. ఖమ్మం, కరీంనగర్ స్థానాల అభ్యర్థులతో పాటు ఆయన పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరో ఈ రోజు సాయంత్రం లేదా రేపటి లోగా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.