Loksabha Elections 2024: మళ్లీ గెలిచేది నేనే.. విశ్వేశ్వర్ రెడ్డి చరిత్ర ఇదే: రంజిత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

ఐదేల్లు ఎంపీగా తాను చేసిన పనుల పట్ల తనకు పూర్తి సంతృప్తిగా ఉందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. మరో సారి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి ఏ ఒక్కరికి కూడా సహాయం చేయలేదన్నారు. రంజిత్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update
Loksabha Elections 2024: మళ్లీ గెలిచేది నేనే.. విశ్వేశ్వర్ రెడ్డి చరిత్ర ఇదే: రంజిత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సొంత నిధులతో ప్రతీ గ్రామానికి ఆరోగ్య చేవెళ్ల రథం పంపించామన్నారు. అపోలో హాస్పటల్ ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి ఏ ఒక్కరికీ వైద్య సహాయం చేయలేదన్నారు. కరోనా సమయంలో ఏ ఒక్కరికి కూడా ఆయన సహాయం చేయలేదన్నారు.  3 లక్షల మెజార్టీతో గెలుస్తానని చెప్పుకుంటున్న విశ్వేశ్వర్ రెడ్డి.. మరి ప్రతీ రోజు ప్రచారంలో తన పేరు ఎందుకు ఎత్తుతున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోటీకి తాను దూరంగా ఉండాలని భావించాన్నారు. రేవంత్ రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను నిరూపిస్తే.. వాటిని ప్రభుత్వానికి రాసిస్తారన్నారు. రంజిత్ రెడ్డి ఆర్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు