/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BRS-Jagadeesh-Reddy-jpg.webp)
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బజారు రౌడీలాగా ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. రోజుకో డ్రామాతో కాలం వెళ్లదీస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తానని ప్రజలను నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నారు. పరిపాలన చేయకుండా చిల్లర మాటాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి బంద్ చేయాలన్నారు. సమస్యలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నాటకం అని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సరైన విధంగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఆర్టీవీతో జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.