కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారన్నారు. ఆయనను పార్టీలోకి తీసుకోక పోవడంతోనే కాంగ్రెస్ లో (Congress) చేరాడన్నారు. చేవెళ్ల లో జరిగే ఎన్నికలు అబివృద్ధికి, రంజిత్ రెడ్డి అవినీతి డబ్బుకి మధ్య జరగనున్నాయన్నారు. రంజిత్ రెడ్డి ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. రంజిత్ రెడ్డి తెలంగాణ లాలూ ప్రసాద్ యాదవ్ అని అన్నారు. రంజిత్ తాడా బొంగరమా? అని గతంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నాడని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు వరుస ప్రమాదాలు.. కారణమేంటి?.. కుటుంబ సభ్యుల ఆందోళన
బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని నేతలంతా వెళ్లిపోతున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏదో ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎంపీ ఎవరనేది చేవెళ్ల ప్రజలకు తెలియదన్నారు. చేవెళ్ల ఎంపీ ఎవరు అని తనను అడుగుతున్నారన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే స్పదించనన్నారు. కాంగ్రెస్ రాహుల్ పేరుతో ఓట్లు అడిగితే ఉన్న ఓట్లు పోతాయన్నారు.
రంజిత్ రెడ్డి పై తగిన సమయంలో కేంద్రం యాక్షన్ తప్పక ఉంటుందన్నారు. అర్బన్ కంటే రూరల్ లో బీజేపీ బలంగా ఉందన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.