Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం సతీమణి.. రేణుకా చౌదరికి చెక్?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి పోటీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం సతీమణి.. రేణుకా చౌదరికి చెక్?
New Update

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఖమ్మం జిల్లాలో సత్తా చాటింది. మొత్తం 10 సీట్లకు గాను 9 సెగ్మెంట్లలో సత్తా చాటాంది. ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇదే ఊపుతో ఖమ్మం ఎంపీని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హైకమాండ్ టికెట్ ఎవరికి ఇస్తుందన్న అంశం మాత్రం జిల్లా రాజకీయాల్లో (Khammam Politics) ఆసక్తికరంగా మారింది. పదేళ్ల క్రితం వరకు ఖమ్మం కాంగ్రెస్ అంటేనే రేణుకా చౌదరి, వనమా వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్ లాంటి పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. మధిర నుంచి 2009లో మొదటిసారిగా విజయం సాధించిన భట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మారిపోయారు. దీంతో ఆయన జిల్లా కీలక నేతగా మారిపోయారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి క్లీన్ స్వీప్ కావడంతో ప్రధాన పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కీలకంగా మారిపోయారు. జిల్లా కాంగ్రెస్ రాజకీయం కూడా ఈ ముగ్గురి చుట్టే తిరుగుతోంది.
ఇది కూడా చదవండి:Telangana: కాళేశ్వరంలో భారీ అవినీతి.. మంత్రుల సంచలన ఆరోపణలు..

ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి విషయంలోనూ ఇప్పుడు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. డిప్యుటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తాని చెబుతున్నారు. పార్లమెంట్ టికెట్ కోసం ఇప్పటి నుంచే ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు నందిని. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా రోజుల నుంచి ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అమ్మా ఫౌండేషన్ పేరిట విస్తృతంగా సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మల్లు నందిని పొలిటికల్ ఎంట్రీ కోసం డిప్యుటీ సీఎం భట్టివిక్రమార్క కూడా చక్రం తిప్పుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా ఖమ్మం టికెట్ ను అంత ఈజీగా వదులుకునే అవకాశం లేదన్న చర్చ కూడా జిల్లా రాజకీయాల్లో వినిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కలిసి ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని రేణుకా చౌదరి కోరారు. దక్షిణాది నుంచి పోటీకి సోనియా గాంధీ విముఖత చూపడంతో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తానే పోటీ చేయాలని రేణుకా చౌదరి నిర్ణయించుకున్నారు.

హైకమాండ్ మద్దతు కూడా తనకే ఉందన్న ధీమాలో రేణుకా చౌదరి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల గెలుపు కోసం రేణుకా చౌదరి విస్తృతంగా పని చేశారు. తాను జిల్లా ఆడబిడ్డనని తనకే టికెట్ పక్కా అని ఆమె అనేకసార్లు చెప్పారు. అయితే.. ఖమ్మం ఎంపీ స్థానానికి ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. దీంతో కాంగ్రెస్ ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందా? లేక కాంగ్రెస్ పార్టీ కొత్తగా మరొకరికి అవకాశం ఇస్తుందా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

#khammam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe