Lokesh Meets Amit Shah: అమిత్ షాతో లోకేష్ భేటీ.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు నాంది?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను నారా లోకేష్‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విరి భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి ఉండటం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి భేటీ.. ఏపీ, తెలంగాణలో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందోనని చర్చ నడుస్తోంది.

New Update
Lokesh Meets Amit Shah: అమిత్ షాతో లోకేష్ భేటీ.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు నాంది?

Lokesh Meets Amit Shah: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టైన తరువాత నుంచి ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ జాతీయ స్థాయిలో వెలుగెత్తిచాటే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఇక ప్రభుత్వం పెద్దలను సైతం కలిసేందుకు లోకేష్ గట్టి ప్రయత్నాలే చేశారని టాక్. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. నెల రోజులు హస్తినలోనే పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. దాంతో లోకేష్ అమరావతికి వచ్చాడు. రెండు రోజులు సీఐడీ విచారణను ఎదుర్కొన్నాడు.

Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

ఏమైందో తెలియదు కానీ బుధవారం రెండవ రోజు సీఐడీ విచారణ ముగియగానే సాయంత్రం 6 గంటలకు హుటాహుటిన అమరావతి నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో నేరుగా ఢిల్లీలో వాలిపోయారు నారా లోకేష్. వెంటనే అమిత్ షాను కలిశారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ సారథులు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి లోకేష్ ను దగ్గరుండి మరీ అమిత్ షాతో కలిపించారు. ఈ భేటీలో లోకేష్ తన సమస్యనంతా అమిత్ షా‌తో పంచుకున్నారని, చంద్రబాబు అరెస్ట్, తనపై తన కుటుంబ సభ్యులపై నమోదు చేస్తున్న కేసులు, విచారణలు సహా అన్ని వివరాలను కేంద్ర హోంమంత్రికి చెప్పారని తెలుస్తోంది. అమిత్ షా సైతం ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతా విన్నాక లోకేష్‌కు నేనున్నానంటూ భరోసా కూడా అమిత్ షా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

భేటీ వెనకున్న రీజన్ ఏంటి?

ఇదంతా ఒక ఎత్తైతే.. వీరి భేటీ వెనుకున్న మతలేంటి? అనేదే ఇప్పుడున్న అసలైన ఇంట్రస్టింగ్ టాపిక్. అసలు ఈ కేసుకు, ఈ వ్యవహారానికి సంబంధమే లేని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ భేటీలో పాల్గొనడం సరికొత్త చర్చకు దారి తీసింది. అవును, ఈ భేటీలో పొలిటికల్ ఫేవర్ దాగుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అసలే ఎన్నికలు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీతో కలిసి వెళ్లే యోచన బీజేపీ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ఇన్ని రోజులు అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా ఇప్పుడు సడెన్‌గా పిలిచి మరీ మాట్లాడారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఏపీలో ఇప్పటికే బీజేపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య ఉంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము టీడీపీతో కలిసి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పొత్తు కోసం బీజేపీతో సైతం మాట్లాడుతానంటూ ప్రకటించారు. మరోవైపు జాతీయ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో పవన్ కామెంట్స్‌పై స్టేట్ బీజేపీ రెస్పాండ్ అవ్వలేదు. ఆయన కామెంట్స్ ఆయన ఇష్టం అంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి దాటవేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే.. టీడీపీ నాయకుడు నారా లోకేష్‌తో కలిసి అమిత్ షా తో పురంధేశ్వరి భేటీ అవ్వడం కొత్త రాజకీయ సమీకరణకు తెరలేపింది. 2014 నాటి పొత్తులు రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!

తెలంగాణలోనూ బీజేపీకి బెనిఫెటే.. అదెలాగంటే తెలంగాణలో జనసేనకు, టీడీపీకి బలం బాగానే ఉంది. ఈ బలం బీజేపీకి తోడైతే.. అధికారానికి చేరువైతామనేది బీజేపీ వేస్తున్న లెక్కల్లా తెలుస్తోంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా.. ఒక్క భేటీలో రెండు రాష్ట్రాల్లోనూ ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా టీడీపీతో ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమ ప్రాబల్యం పెంచుకోవాలని కమలదళం భావిస్తోందని టాక్. ఏపీలో సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో అధికారం ఊరిస్తున్న నేపథ్యంలో.. పార్టీకి ఇది ప్లస్ అవుతుందని విశ్వసిస్తోందట బీజేపీ అగ్రనాయకత్వం. అందుకే ఈ భేటీలో అటు పురంధేశ్వరి, ఇటు కిషన్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ భేటీ పొలిటికల్ బంధాన్ని పెనవేస్తుందా? లేక సాధారణ భేటీయేనా తేలాలంటే వేచి చూడాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు