Lokesh: 'జ‌గ‌నాసుర ద‌హ‌నం'.. వాటిని ద‌హ‌నం చేయాలని లోకేశ్‌ పిలుపు..!

New Update
Lokesh: 'జ‌గ‌నాసుర ద‌హ‌నం'.. వాటిని ద‌హ‌నం చేయాలని లోకేశ్‌ పిలుపు..!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu naidu) అక్రమ అరెస్టుకు నిరసనగా వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పిలుపునిచ్చింది. ‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం’అంటూ సోమవారం రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 నిమిషాల పాటు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి 'సైకో పోవాలి' అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయాలని లోకేశ్‌(Lokesh) పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లుగా అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని ట్వీట్ చేశారు. ఈమేరకు ఆ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందాం అంటూ నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.


ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కరువు:
సైకో జ‌గ‌న్ విధ్వంస పాల‌న‌లో మ‌రో విషాదం జరిగిందని నారా లోకేశ్ తెలిపారు. ప్రచారానికి వేల కోట్లు తగలేస్తూ.. జగనన్న సురక్ష అని డ‌బ్బా కొట్టుకుంటూ.. ఆస్పత్రిలో కనీస వైద్యసదుపాయాలు కల్పించని దుస్థితి నెలకొంది అని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రికి చేరేందుకు వెళ్లే రోడ్లు గుంత‌ల‌మ‌య‌మై ప్రాణాలు తీసిన దారుణంగా ఉన్నాయని, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే వైద్యారోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ సొంత జిల్లాలో జ‌రిగిన ఘోరం అని నారా లోకేశ్ ఆరోపించారు. ప‌ల్నాడు జిల్లా కారంపూడి పట్టణానికి చెందిన బ‌త్తిన ఆనంద్ త‌న భార్య రామాంజమ్మకి పురిటినొప్పులు రావ‌డంతో స్థానిక పీహెచ్సీకి తీసుకెళితే, సౌక‌ర్యాలు లేవ‌ని వైద్యులు చెప్పగా గుర‌జాల ఆస్పత్రికి త‌ర‌లించారన్నారు. అక్కడి వైద్యులూ వైద్యం చేయ‌లేమ‌ని చెప్పడంతో న‌ర‌స‌రావుపేట త‌ర‌లించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బైక్‌పై ఇంటికెళ్లి వైద్య ఖ‌ర్చులకు డ‌బ్బులు తెస్తూ జూల‌క‌ల్లు దగ్గర రోడ్డు గుంత‌ల్లో ప‌డి ఆనంద్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడని, భార్యని ప్రస‌వానికి చేర్చిన న‌ర‌స‌రావుపేట ఆస్పత్రిలోనే ప్రాణాలు వ‌దిలాడంటూ ఆరోపించారు. ఆనంద్ రోడ్డు ప్రమాదంలో చ‌నిపోలేదని.. జ‌గ‌నాసురుడి విధ్వంస పాల‌న బ‌లి తీసుకుందన్నారు. ఇది స‌ర్కారీ హ‌త్య అని నారా లోకేశ్(Nara Lokesh) మండిపడ్డారు.

ఏపీలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు:
ఏపీలో అన్నదాతల కష్టాలపై ఆదివారం నాడు టీడీపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ.. పార్టీ నేతలకు నారా లోకేశ్‌ సూచించారు.

Also Read: సమరానికి సై.. దసరా తర్వాత ప్రచారంలోకి దిగనున్న బీజేపీ అగ్రనేతలు

Advertisment
తాజా కథనాలు