/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/PAWAN-LOKESH-S.jpg)
Lokesh: చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ గా మారింది. పవన్ వద్దంటున్నప్పటికీ సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. దీనికి సంబంధించిన వీడియోను జనసైనికులు, టీడీపీ ఫాలోవర్లు షేర్ చేస్తున్నారు. ఇది చూశాక లోకేష్ పై మరింత అభిమానం పెరిగిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన స్పెషాలిటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
. @naralokesh Garu took Blessings from @PawanKalyan Garu ❤️pic.twitter.com/4AWoe0pLBl
— Pawan Kalyan Holics™ (@PSPKHolics) June 13, 2024
పవన్ స్పెషల్ అట్రాక్షన్..
ప్రమాణస్వీకారం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభి వందనం చేయడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం ప్రధాని మోదీని అన్నయ్య వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మోదీతో మెగా బ్రదర్స్ ముచ్చట నిన్నటి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో హైలెట్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. తాజాగా లోకేష్ పవన్ కల్యాణ్ పాదాలకు నమస్కరించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో అది వైరల్ గా మారింది.