చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదు.. ఇక యుద్ధమే.. లోకేశ్‌ వార్నింగ్

సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దకూరపాడులో జరుగుతున్న పాదయాత్రలో వైసీపీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిపులు చెరిగారు.

Lokesh: ప్యాలెస్ బ్రోకర్ సజ్జల.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
New Update

Nara Lokesh: పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వైసీపీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిపులు చెరిగారు.

publive-image

"తమ ఓపిక నశించింది.. చంద్రబాబు ఆగమన్న ఇక ఆగేది లేదు. ఇకపై మా అధినేత జోలికి వస్తే జరగబోయేది యుద్దమే. ముఖ్యమంత్రి జగన్ వీధి రౌడీ కాబట్టే మారణహోమం. జగన్ రెడ్డి కులం ఫ్యాక్షనిజం.. మతం సైకోయిజం. రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను మాపై ఉసిగొల్పుతున్నారు. వైసీపీ నేతల మాటలు విని వేధించే పోలీసులను వదలం. ఉద్యోగాల నుంచి డిస్మస్ చేసి కటకటాల వెనక్కి పంపుతాం" అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరూ అధైర్య పడవద్దు. బాధితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది."అని లోకేశ్ భరోసా ఇచ్చారు.

బ్యాంకులను ముంచేసి లక్ష కోట్లు దొబ్బి 16 నెలలు చిప్పకూడు తిన్న 420 ముఖ్యమంత్రి కావడం వల్లే టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. తాము కార్యకర్తలను రెచ్చగొడుతున్నామని సజ్జల అంటున్నారని.. మా వాళ్లను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.

రాష్ట్రంలో రాక్షస పాలనకు జగన్ శ్రీకారం చుట్టారని.. తాను ఫుల్ స్టాప్ పెడతానని తెలిపారు. మా కార్యకర్తలను హతమార్చారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా మా అధినేతపైనే హత్యాయత్నం చేశారన్నారు. మరోసారి ఆయన జోలికొస్తే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చంద్రబాబు ఇంటిపై దాడిచేసిన వారికి, మమ్మల్ని బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా ప్రజలకు ఏమి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. జగన్ ఒక సైకో... చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను జిల్లాకు ఒకరిని తయారు చేసి తమ కార్యకర్తల పైకి ఉసిగొల్పుతున్నారని లోకేశ్ వెల్లడించారు.

పోలీసుల  కేసులకు టీడీపీ కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదు. తనపై 20 కేసులు ఉన్నాయని.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 74 కేసులు బనాయించారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీహార్ లో ఇలాంటి పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు జగన్ ఏపీని బీహార్ లా మార్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe