కల్లు తాగిన నారా లోకేష్.. వీడియో వైరల్.!

ముమ్మిడివరం నియోజకవర్గంలో కల్లు గీత కార్మికులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు నారా లోకేశ్. అయితే, ఈ సందర్భంగా వారు ఆప్యాయంగా అందించిన కల్లును సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు.

New Update
AP News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమోషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Nara Lokesh: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ వర్గాలను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మికులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు నారా లోకేశ్.

Also read: గమ్మున కూసున్న గ్రేటర్ ఓటర్.. ఎందుకలా?

ఈ క్రమంలోనే వారు ఆప్యాయంగా అందించిన కల్లును సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నారా లోకేశ్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. కల్లు గీత కార్మికులు చూపించిన ప్రేమ మాటల్లో వర్ణించలేనని తెలిపారు. కల్మషం ఎరుగని మనుషులు అభిమానంతో అందించిన స్వచ్ఛమైన కల్లు స్వీకరించానని లోకేశ్ వెల్లడించారు. కల్లు గీత కార్మికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌దే ఆధిక్యం.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు