Nara Lokesh: దాహం వేసి మంచినీళ్లు అడిగితే.. మూత్రం పోసి అవమానిస్తారా.!
జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో యువకుడు శ్యామ్ కుమార్ ను చిత్రహింసలు పెట్టడమేగాక..మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.
Nara Lokesh: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు టీడీపీ యువనేత నారా లోకేశ్. ఏపీలో జరిగిన కొన్ని ఘటనలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు… pic.twitter.com/gE5KinSYmD
జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసలు పెట్టడమేగాక.. దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని మండిపడ్డారు.
జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం... జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని చెప్పారు.
Nara Lokesh: దాహం వేసి మంచినీళ్లు అడిగితే.. మూత్రం పోసి అవమానిస్తారా.!
జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో యువకుడు శ్యామ్ కుమార్ ను చిత్రహింసలు పెట్టడమేగాక..మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.
Nara Lokesh: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు టీడీపీ యువనేత నారా లోకేశ్. ఏపీలో జరిగిన కొన్ని ఘటనలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసలు పెట్టడమేగాక.. దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని మండిపడ్డారు.
Also read: ఏపీలో ఈ నెల 15 నుంచి కుల గణన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం