పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే సభ నుంచి 139 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా తాజాగా నేడు మరో ఇద్దరు ఎంపీలను సభ సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీ ల సంఖ్య 141 కి చేరింది. ఈ రోజు సస్పెండ్ అయిన వారిలో కేరళ ఎంపీలు చజికదన్ కాంగ్రెస్, ఏఎం ఆరిఫ్ సీపీఎం ఎంపీలు.
పార్లమెంట్ ఎదుట సస్పెండైన ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. 141 ఎంపీల సస్పెన్ష్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇంతమంది ఎంపీలను ఎప్పుడూ సస్పెండ్ చేయలేదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లు లేవనెత్తితే సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.4 రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగిన స్మోక్ ఘటన అసలు క్షమించరానిది అని వారు పేర్కొన్నారు.
ఘటన జరిగి 4 రోజులు అయినప్పటికీ ప్రధాని స్పందించకపోవడం చాలా బాధాకరమని వారు అన్నారు. ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం బిగించిన ఉరి ఇది అని పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన భద్రతా ఉల్లంఘనలపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సభలోనికి ప్రవేశించి స్మోక్ బాంబులు ప్రయోగించిన విషయం గురించి ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడకపోవడంతో విపక్షాలు ఆయన వెంటనే ఈ ఘటన గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో ఎంపీలు సభ నియామాలు ఉల్లంఘించి సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో సోమవారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 141 మంది ఎంపీలను సభా సస్పెండ్ చేసింది.
Also read: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్!