అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ ఓకే!

బుధవారం లోక్‌ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్‌ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ''అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్‌ సభలో ప్రకటన చేశారు.

New Update
Parliament Session: లోక్సభలో గందరగోళం.. సభను వాయిదా వేసిన స్పీకర్

బుధవారం లోక్‌ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్‌ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ''అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్‌ సభలో ప్రకటన చేశారు.

lok sabha speaker om birla accepts the no confidence

లోక్‌ సభలో మణిపూర్ పై చర్చ జరిగే సమయంలో ప్రధాని మోడీ కూడా సభకు రావాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన నాలుగు రోజుల నుంచి కూడా మణిపూర్‌ అంశం కుదిపేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి.

మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సమాధానం కోరేందుకు లోక్‌సభలో అధికార పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానం ఒక మార్గమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ‘‘I.N.D.I.A’’ కూటమిలో భాగంగా లేని విపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా సెపరేటుగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. మ‌ణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు స‌రిగా లేవ‌ని బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపించింది.

రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అయితే సభలో 50 మంది సభ్యులు మద్దతు ఇస్తేనే అవిశ్వాస తీర్మానం పెడతారు. కాంగ్రెస్ తీర్మానానికి అవసరమైన మద్దతు లభిస్తుందని అంచనా వేయగా.. బీఆర్ఎస్‌కు లోక్‌సభలో కేవలం 9 మంది సభ్యులను మాత్రమే కలిగి ఉంది. ఇక, 543 మంది సభ్యులతో కూడిన లోక్‌సభలో ప్రస్తుతం అధికార ఎన్డీయే బలం 331 కాగా.. ప్రతిపక్ష I.N.D.I.A కూటమికి 144 మంది సభ్యులు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు