Jithender Reddy: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి? బీజేపీకి తెలంగాణలో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీజేపీ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. By V.J Reddy 14 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Jithender Reddy May Join in Congress: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి తెలంగాణలో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు కాకుండా డీకే అరుణకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. దీంతో బీజేపీ పై అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. తనకే వస్తుందన్న ధీమా.. ఢమాల్.. తనకు బీజేపీ అధిష్టానం పక్కాగా టికెట్ ఇస్తుందని భావించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనదే.. తనకు ఎవరు పోటీ లేరు అంటూ ఆయన సామజిక మాధ్యమాల్లో చెబుతూ వచ్చారు. అయితే మొదటి జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ స్థానాన్ని ప్రకటన చేయకుండా హోల్డ్ లో పెట్టింది బీజేపీ అధిష్టానం. ఇందుకు కారణం అక్కడ ఇద్దరు బలమైన నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉండడమే. ఒకవేళ ముందుగా ప్రకటిస్తే పార్టీ చీలుతుందని భావించిన బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు రెండో జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ జాబితాలో జితేందర్ రెడ్డికి షాక్ ఇచ్చింది కమలం పార్టీ. జితేందర్ రెడ్డికి కాకుండా డీకే అరుణకు ఎంపీ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం తనకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జితేందర్ రెడ్డి నిరాశే మిగిల్చింది. అయితే.. టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి తదుపరి రాజకీయ కార్యాచరణ పై ఉత్కంఠ నెలకొంది. ALSO READ: టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా ఇప్పటికి 15 మంది ప్రకటన.. 1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్ 2. బండి సంజయ్ – కరీంనగర్ 3. ధర్మపురి అర్వింద్ – నిజామాబాద్ 4. బీబీ పాటిల్ – జహీరాబాద్ 5. పోతుగంటి భరత్ – నాగర్ కర్నూల్ 6. బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి 7. కొండ విశ్వేశ్వర రెడ్డి – చేవెళ్ల 8. మాధవీలత – హైదరాబాద్ 9. ఈటల రాజేందర్ – మల్కాజ్‌గిరి 10. రఘునందన్ రావు - మెదక్ 11. నగేష్ - ఆదిలాబాద్ 12. సీతారాం నాయక్ - మహబూబాబాద్ 13. సైది రెడ్డి - నల్గొండ 14. డీకే అరుణ - మహబూబ్ నగర్ 15. గోమస శ్రీనివాస్ - పెద్దపల్లి #lok-sabha-elections-2024 #jithender-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి