Congress Second List: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్.. అభ్యర్థులు వీరే? తొలి జాబితాలో నలుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించగా.. తాజాగా మరో ఐదు మందిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్- దానం, చేవెళ్ల -రంజిత్, పెద్దపల్లి- గడ్డం వంశీ, ADLB- డా. సుమలత, మల్కాజ్‌గిరి - బొంతు రామ్మోహన్ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. By V.J Reddy 19 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Congress Second List: లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ALSO READ: నా కొడుకును కలిసేందుకు అనుమతి ఇవ్వండి.. కవిత పిటిషన్ 13 మందిని ప్రకటించే ఛాన్స్..! తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగురు ఎంపీ అభ్యర్థులను తొలి జాబితాలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు. తాజాగా ఈరోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 13 మందితో తుది జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో జంపింగ్ లకే ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ ప్రకటించనున్న తుది జాబితాలో ఎవరికి టికెట్ వస్తుందో వేచి చూడాలి. 5 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు..? తొలి జాబితాలో తెలంగాణలోని జహీరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఐదు స్థానాలు ఏంటో చూద్దాం. * సికింద్రాబాద్ - దానం నాగేందర్ * మల్కాజ్ గిరి - బొంతు రామ్మోహన్ * చేవెళ్ల - రంజిత్ రెడ్డి * పెద్దపల్లి- గడ్డం వంశీ * ఆదిలాబాద్ - డా. సుమలత తొలి జాబితాలో నలుగురు.. * జహీరాబాద్- సురేష్ షెట్కర్ * నల్గొండ – జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి * మహబూబాబాద్- బలరాం నాయక్ * మహబూబ్ నగర్ – వంశీచంద్ రెడ్డి #congress-second-list #telangana-congress-mp-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి