Aroori Ramesh: బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఈరోజు అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Aroori Ramesh: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా

Aroori Ramesh Joins BJP: బీఆర్ఎస్ లో వలసల పర్వానికి ఇంకా తెరపడడం లేదు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతలు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోచేరారు. ఈరోజు ఆయన మందకృష్ణ మాదిగతో కలిసి అమిత్ షాను కలిశారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ వరంగల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. వరంగల్ నుంచి ఎంపీ గా పోటీ చేస్తానని కేసీఆర్ తో చెప్పగా.. దానికి కేసీఆర్ నో అనడంతో ఆయన గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో రహస్య చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన డిమాండ్ ను బీజేపీ అధిష్టానం అంగీకరించగా.. తాజాగా ఆయన కారు దిగి కాషాయ గూటికి చేరుకున్నారు.

ALSO READ: మల్లారెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్!

ఆపరేషన్ ఆకర్ష్ షురూ..!

తెలంగాణ బీజేపీలోకి భారీగా చేరికలు నమోదుఅవుతున్నాయి. ఇటీవల బీజేపీలో ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే చేరారు. బీజేపీలోకి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, నగేష్‌, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చేరారు. ఢిల్లీలో జాతీయ నేతల ఆధ్వర్యంలో పార్టీలో ముగ్గురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. వీరి ముగ్గురికి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖమ్మం లోక్‌సభ సీటును జలగం వెంకట్రావు.. మహబూబాబాద్ లోక్ సభ అభ్యర్థిగా సీతారాం నాయక్‌.. అదిలాబాద్ లోక్ సభ స్థానం నగేష్ ఆశిస్తున్నారు. అయితే.. ఆదిలాబాద్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కూడా ఈసారి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

బీజేపీ సెకండ్ లిస్టులో వీరి పేరు?..

* మెదక్ – రఘునందన్ రావు.
* మహబూబ్ నగర్ – డీకే అరుణ
* ఆదిలాబాద్ – నగేష్
* మహబూబాబాద్ – మాజీ ఎంపీ సీతారాం
* ఖమ్మం – జలగం వెంకట్రావు
* వరంగల్ - ఆరూరి రమేష్

Advertisment
Advertisment
తాజా కథనాలు