Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలను నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే, ఈ సిబ్బంది ఎవరు ఉంటారు? వారి డ్యూటి ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? లాంటి సమాచారం పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

Lok Sabha Elections 2024: ఏ ప్రజాస్వామ్యానికైనా ఎన్నికలు గొప్ప పండుగ లాంటివి. ప్రస్తుతం దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో ఈసారి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు కొనసాగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికలను నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. ఈ సిబ్బంది ఎవరు ఉంటారు? వారి డ్యూటి ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? లాంటి వివరాలు తెలుసుకుందాం!

గైర్హాజరయ్యే అవకాశం..

ఎన్నికల సిబ్బందిని వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, జాతీయ బ్యాంకులు, LICతో సహా ప్రభుత్వ రంగ సంస్థలతో సహా వివిధ సంస్థల నుంచి తీసుకుంటారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్ , జోనల్ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, ఎన్నికలలో ఉపయోగించే వాహనాల క్లీనర్లు మొదలైనవారు ఉంటారు. ఎన్నికల విధులకు నియమితులైన వ్యక్తులు గైర్హాజరయ్యే అవకాశం లేదు. ఒకవేళ విధులకు అటెండ్‌ కాకపోతే కమిషన్ శిక్ష విధిస్తుంది.

నియమించుకోకూడదు..

కేంద్రం లేదా రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న వారిని మాత్రమే ఎన్నికల డ్యూటీలో పెట్టవచ్చు. అవసరమైతే, పదవీ విరమణ తర్వాత డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను కూడా తీసుకోవచ్చు. ఎన్నికల పనిలో కాంట్రాక్ట్ వారిని నియమించుకోకూడదు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చు. ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి ఫస్ట్, పోలింగ్ అధికారి ద్వితీయ, పోలింగ్ అధికారి తృతీయ పాత్ర పోషిస్తారు.

Also Read: అలా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. కారుమూరి సునీల్ సవాల్..!

6 నెలల జైలు శిక్ష..

ఒక అధికారి లేదా ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంటే, అది నాన్-కాగ్నిజబుల్ కేసుల కేటగిరీ కిందకు వస్తుంది. శాఖాపరమైన చర్యలే కాకుండా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 128 ప్రకారం అధికారి లేదా ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. దీని కింద నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష విధించే నిబంధన ఉంది.

DEO మాత్రమే..

ప్రభుత్వోద్యోగి ఎన్నికల విధిని రద్దు చేయడానికి నాలుగు కారణాలు మాత్రమే ఉన్నాయి. సంబంధిత ఉద్యోగి తన ఉన్నతాధికారులకు చెల్లుబాటు అయ్యే రుజువును సమర్పించాలి. ఎన్నికల విధి నుంచి మినహాయింపు ఉత్తర్వులను జిల్లా ఎన్నికల అధికారి- DEO మాత్రమే ఆమోదించగలరు. చాలా జిల్లాల్లో, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 13A ప్రకారం జిల్లా కలెక్టర్‌ను DEOగా నియమిస్తారు. ఒక ఉద్యోగికి రెండు వేర్వేరు చోట్ల డ్యూటీ ఇస్తే, అతను రెండు చోట్లా రిపోర్టు చేయడం అసాధ్యం. అప్పుడు సంబంధిత వ్యక్తి ఒకే చోట డ్యూటీని రద్దు చేయమని అభ్యర్థించవచ్చు.

మినహాయింపు..

ఒక ఉద్యోగి నిర్దిష్ట రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉంటే తగిన ప్రూఫ్స్‌ సమర్పించి ఎన్నికల డ్యూటి నుంచి మినహాయింపు పొందవచ్చు. లోక్‌సభ ఎన్నికల తేదీలు, మీ విదేశీ ప్రయాణం ఒకే సమయంలో ఉంటే మీరు ఎన్నికల విధిని రద్దు చేయమని అడగవచ్చు. అయితే ప్రయాణాన్ని ముందుగానే బుక్ చేసుకోని ఉండాలి. గుండె జబ్బులు లేదా వారి పనితీరును ప్రభావితం చేసే అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా మినహాయింపు పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు