-
May 07, 2024 13:43 ISTబల్రాంపూర్ జిల్లాలో సంప్రదాయ నృత్యాలతో పోలింగ్ కేంద్రాలకు..
-
May 07, 2024 12:20 ISTఉదయం 11 గంటల వరకు 25.4 శాతం పోలింగ్ నమోదు
-
May 07, 2024 11:54 ISTఛత్తీస్‌గఢ్ లో కొనసాగుతోన్న పోలింగ్
-
May 07, 2024 11:53 ISTహర్పనహళ్లిలో ఓటు వేసిన వారికి మొక్కలు అందించిన అధికారులు
-
May 07, 2024 11:35 ISTగోవాలో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్
-
May 07, 2024 11:30 ISTఅహ్మదాబాద్ లో ఓటు వేయడానికి వచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ
-
May 07, 2024 11:28 ISTకర్ణాటక హవేరీ లో ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై
-
May 07, 2024 11:26 ISTఓటర్లు మావైపే అంటున్న లాలూ ప్రసాద్ యాదవ్
-
May 07, 2024 11:22 ISTఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ఎల్జీ వీకే సక్సేనా
-
May 07, 2024 11:15 ISTఓటు వేయడానికి ముందు ఆలయంలో పూజలు చేసిన దిగ్విజయ్ సింగ్
భోపాల్‌లో ఓటు వేయడానికి ముందు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ జవహర్ చౌక్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో భార్య అమృతా సింగ్‌తో కలిసి పూజలు చేశారు.
-
May 07, 2024 11:13 ISTభోపాల్ లో ఓటు వేసేందుకు మహిళల ఉత్సాహం
-
May 07, 2024 10:58 ISTఓటింగ్ బహిష్కరించిన గ్రామస్తులు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లోని గర్హి ధరూ గ్రామ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామానికి ఎంపీ-ఎమ్మెల్యే రోడ్డు వేయలేదని అంటున్నారు. రోడ్డు సమస్య తీరకపోతే ఏ పార్టీకి ఓటేయబోమన్నారు
-
May 07, 2024 10:56 ISTఫిరోజాబాద్‌లో నకిలీ ఓటు వేయడానికి వచ్చి పట్టుబడ్డారు
ఫిరోజాబాద్‌లో నకిలీ ఓట్లు వేయడానికి వచ్చిన 42 మందిని పోలీసులు పట్టుకున్నారు. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మంది, రసూల్‌పూర్‌లో 12 మంది, దక్షిణాది నుంచి 10 మందిని అరెస్టు చేశారు.
-
May 07, 2024 10:55 ISTఓటుహక్కు వినియోగించుకున్న దివ్యాంగ వయోజనుడు..
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 62 ఏళ్ల అనూప్ కుమార్ ఓటు వేయడానికి వీల్ చైర్‌లో వచ్చారు. అతడి రెండు కాళ్లు తెగిపోయాయి.
-
May 07, 2024 10:52 ISTతన భార్యతో కలిసి ఓటు వేసిన అఖిలేష్ యాదవ్
-
May 07, 2024 10:51 ISTఓటు వేసిన ప్రముఖులు
కర్ణాటకలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్రలోని బారామతిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రియా సూలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
May 07, 2024 10:50 ISTఓటు వేసిన అఖిలేష్ యాదవ్
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి మెయిన్‌పురిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
-
May 07, 2024 10:48 ISTజంగిల్ థీమ్ లో పోలింగ్ బూత్
రాయ్‌పూర్‌లోని అటవీ శాఖ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌ను జంగిల్ థీమ్‌లో అలంకరించారు. ఓటర్లకు నీడ కోసం చలువ పందిళ్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. తద్వారా వారు తమ టర్న్ కోసం నిలబడి కాకుండా కూచుని వేచి ఉన్నారు.
-
May 07, 2024 10:43 ISTపోలింగ్ కేంద్రంలో తేనెటీగలు దాడి
రాయ్‌గఢ్ లోక్‌సభలోని జష్‌పూర్‌లోని అరా పోలింగ్ కేంద్రంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన 8 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. వారందరినీ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
-
May 07, 2024 10:41 ISTమూడు తరాలు కలిసి ఓటు వేశారు
రాయ్‌గఢ్‌లో మూడు తరాలు కలిసి ఓటు వేశారు. సనత్ నాయక్ తాత గుల్మాని నాయక్, తండ్రి గెస్రం నాయక్‌తో కలిసి గెజముడ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
May 07, 2024 10:39 ISTమధ్యప్రదేశ్‌లో ఓటు వేయడానికి వెళుతున్న యువకుడి కాల్చివేత
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భింద్‌లో ఓటు వేయడానికి వెళ్తున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు చుట్టుముట్టి కాల్చిచంపారు. బుల్లెట్ అతని కడుపులోకి దూసుకెళ్లింది. దీంతో ఎక్కడికక్కడే ఆ యువకుడు మరణించాడు
-
May 07, 2024 10:36 ISTఅక్కడక్కడా ఘర్షణలు..
బీహార్‌లో ఓటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ బీజేపీ అభ్యర్థి, టీఎంసీ మద్దతుదారు మధ్య ఘర్షణ జరిగింది.
-
May 07, 2024 10:34 ISTగుండెపోటుతో మరణించిన ప్రిసైడింగ్ ఆఫీసర్
బీహార్‌లోని సుపాల్‌లోని పోలింగ్ బూత్‌లో శైలేంద్రకుమార్ అనే ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మరణించారు.
-
May 07, 2024 10:28 ISTదేశంలో ఉదయం 9 గంటల వరకు ఎంత ఓటింగ్ అయిందంటే..
ఉదయం 9 గంటల వరకు దేశంలో 10.57 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 14.60 శాతం ఓటింగ్ జరిగింది. అస్సాం 10.12%, బీహార్ 10.03%, ఛత్తీస్‌గఢ్ 13.24%, గోవా 12.35%, గుజరాత్ 9.87%, కర్ణాటక 9.45%, మధ్యప్రదేశ్ 14.22%, మహారాష్ట్ర 6.64%, ఉత్తరప్రదేశ్ 11.63%, పశ్చిమ బెంగాల్ 14.60% పోలింగ్ జరిగింది.
-
May 07, 2024 10:25 ISTకుటుంబంతో సహా బీసీసీఐ అధికార ప్రతినిధి అజయ్ దేవ్నానీ ఓటు
బీసీసీఐ అధికార ప్రతినిధి అజయ్ దేవ్నానీ తన కుటుంబంతో పాటు ఓటు వేశారు. ఆయన కొడుకు దక్ష్ దేవ్నానీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
May 07, 2024 10:17 ISTఓటు వేయడానికి వచ్చిన కర్ణాటక మాజీ సీఎం బస్వరాజు బొమ్మై
-
May 07, 2024 10:15 ISTకర్ణాటకలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళ నృత్యం
-
May 07, 2024 10:14 ISTఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు
-
May 07, 2024 10:11 ISTఓటుహక్కు వినియోగించుకున్న జెనీలియా దంపతులు
-
May 07, 2024 10:09 ISTఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
-
May 07, 2024 10:07 ISTకర్ణాటకలో కొనసాగుతోన్న పోలింగ్
🔴 Lok Sabha Election 2024 Phase 3 Live Updates: కొనసాగుతోన్న 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్ అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మొత్తం 93 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తోంది ఈసీ.
New Update
Advertisment