BREAKING: లోక్ సభ సోమవారానికి వాయిదా లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలంటూ విపక్షాల ఆందోనళ నడుమ సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. జులై 1న ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. By V.J Reddy 28 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Lok Sabha: లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలంటూ విపక్షాల ఆందోనళ నడుమ సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ వల్ల ఆందోళనలో ఉన్న విద్యార్థులకు సభ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులకు అండగా ఉంటామన్న భరోసాను అధికార, విపక్షాలు ఇవ్వాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సభలో నీట్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ అంశంపై చర్చిద్దాం అని స్పీకర్ తెలిపారు. తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. కాగా నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలంటూ విపక్ష నేతలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం పై చర్చిన తరువాత ఈ పేపర్ లీక్ అంశంపై చర్చిద్దాం అని స్పీకర్ చెప్పినా.. విపక్ష నేతలు ఆందోళన ఆపలేరు. విపక్షాల ఆందోనళతో ససేమిరా అన్న స్పీకర్.. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించేందుకు నో చెప్పారు. దీంతో విపక్షపార్టీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లింది. సభను అదుపు చేసేందుకు ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయగా.. మరోసారి విపక్షాలు ఆందోళన చేయడంతో సభను సోమవారానికి అంటే జులై 1కి వాయిదా వేశారు. #lok-sabha-adjourned మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి