National Film Awards: జాతీయ సినిమా అవార్డుల వెనుక లాబీయింగ్‌ జరిగిందా?

జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించడం వెనుక కారణాలేంటి..? RRR సినిమాకుగానూ రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌లలో ఒకరికి అవార్డు వస్తుందని ప్రచారం జరిగినట్టుంది..?నంది అవార్డుల స్థాయిలో తెలుగు సినిమాకు పది అవార్డులు రావడం వెనుక కారణం..? అటు పుష్ప, ఇటు ఉప్పెనకు అవార్డులు రావడం వెనుక మైత్రీ సంస్థ లాబీయింగ్ ఉందా..?

National Film Awards: జాతీయ సినిమా అవార్డుల వెనుక లాబీయింగ్‌ జరిగిందా?
New Update

జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించడం వెనుక కారణాలేంటి..? RRR సినిమాకుగానూ రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌లలో ఒకరికి అవార్డు వస్తుందని ప్రచారం జరిగినట్టుంది..?నంది అవార్డుల స్థాయిలో తెలుగు సినిమాకు పది అవార్డులు రావడం వెనుక కారణం..? అటు పుష్ప, ఇటు ఉప్పెనకు అవార్డులు రావడం వెనుక మైత్రీ సంస్థ లాబీయింగ్ ఉందా..?

69వ జాతీయ ఫిలిం అవార్డ్స్‌లో తెలుగు సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలకే అత్యధిక అవార్డులు వచ్చాయి. మొత్తంగా తెలుగు సినిమాలకు పది అవార్డులు దక్కాయి. RRR సినిమాకు ఆరు కేటగిరిల్లో అవార్డులు రాగా.. పుష్ప సినిమాలోని నటనకు అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఎంపికయ్యాయి. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపికవ్వగా.. కొండపొలంలోని పాటకు ఉత్తమ రచయితగా సుభాష్‌ చంద్రబోస్‌ నిలిచారు.

అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. RRR సినిమాకుగానూ రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లలో ఒకరికి అవార్డు వస్తుందని భావించినా.. వారికి అవార్డు రాకపోవడంతో లాబీయింగ్ జరిగి ఉండొచ్చు ఏమోనని భావిస్తున్నారు. నంది అవార్డుల స్థాయిలో తెలుగు సినిమాకు పది అవార్డులు రావడం దేనికి సంకేతం. అటు పుష్ప, ఇటు ఉప్పెనకు అవార్డులు రావడం వెనుక మైత్రీ సంస్థ లాబీయింగ్ చేసిందా అనే డౌట్స్ కూడా వ్యక్తంచేస్తున్నారు.

ది కశ్మీర్‌ ఫైల్స్‌కు నేషనల్ ఇంటిగ్రిటి అవార్డు రావడం కూడా వివాదాస్పదమవుతోంది. ఇక సూర్య నటించిన జై భీమ్, కర్ణన్, సార్పట్టా, పరంపర లాంటి తమిళ సినిమాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మళయాలం ఇండస్ట్రీ నుంచి జోజి జార్జ్‌ నటనకు నాయట్టు సినిమాకు జాతీయ స్థాయి అవార్డు వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. జాతీయ అవార్డులంటే ఒకప్పుడు నార్త్‌ సినిమాలకే ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారిందనుకోవాలా..? ఇకపై ఏటా తెలుగు సినిమాలకు నేషనల్‌ అవార్డ్స్‌లో స్థానం ఉంటుందో లేదో వేచి చూడాలంటున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe