Lizard Facts : బల్లి మీద పడితే ఇలా చేయండి ? అంతా శుభమే !!

బల్లి మీద పడితే భయం తో వణికిపోతాం. కీడు జరుగుతుందని పూజలు చేస్తాం. కానీ బల్లి శాస్త్రంలో విస్తు పోయే నిజాలున్నాయి. మహిళల్లో , పురుషుల్లో కొన్ని భాగాలపై పడితే శుభం ,కొన్ని భాగాలపై పడితే అపచారం. బల్లి శాస్త్రం ప్రకారం కొన్ని రెమిడీస్ పాటిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి.

New Update
Lizard Facts : బల్లి మీద పడితే ఇలా చేయండి ? అంతా శుభమే !!

Lizard: బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మన మీద పడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరుతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉండదు. ఇంతకీ బల్లి పురుషులపై కాని , స్త్రీల పైగాని ఏ ఏ శరీర భాగాలలో బల్లిపడితే ఎలాంటి ప్రభావం చూపుతుంది ? ఈ విషయంపై బల్లి శాస్త్రం ఏం చెబుతోంది ?

మహిళల్లో ఈ బాగాలపై బల్లి పడితే అదృష్టం

బల్లి స్త్రీ యొక్క శిరస్సు అంటే తలపై భాగాన పడితే మరణ భయం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అలాగే శిరోజాలపై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచన. కాలిపిక్కలను బల్లి తాకితే ఇంటికి చుట్టాలు వస్తున్నారని సూచన. అలాగే బల్లి ఎడమకన్నును తాకితే భర్త దగ్గరనుంచి కాని , సన్నిహితుల తో గాని విపరీతమిన ప్రేమాప్యతలు పొందుతారు. కుడికన్నును తాకితే మానసిక ఆందోళనకు గురవుతారు. కింది పెదవిని తాకినట్లయితే నూతన వస్తు లాభం .. ఇక .. పొరపాటున రెండు పెదవులను బల్లి తాకితే అన్నీ కష్టాలే. ఇక.. స్త్రీల యొక్క వీపు భాగంలో బల్లి పడినట్లయితే మరణ వార్త వింటారు. ఇక.. అర్ధం పర్ధం లేని గొడవలకు దారితీసే పరిస్థితి ఎప్పుడు ఎదురవుతున్దంటే .. బల్లి స్త్రీల చేతి గోళ్ళపై పడ్డప్పుడు. గోళ్ళను తాకకుండా కేవలం వేళ్ళను మాత్రమె తాకితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడి భుజాన్ని బల్లి తాకినట్లయితే స్త్రీలలో విపరీతమయిన కామ కోరికలు కలుగుతాయి. ఇక..వక్ష స్తలంపై పడితే అంతా మంచే జరుగుతందని సూచన. స్త్రీల యొక్క కాలి వేళ్ళపై పడితే పుత్ర సంతానం సిద్ధిస్తుందని బల్లి శాస్త్రం చెబుతోంది.

ALSO READ :OTT vs Venditera : వెండితెర సవాళ్లు 2023.. ఓటిటి vs సినిమా

పురుషులపై ఈ బాగాన బల్లి పడితే శుభానికి సూచన

ఇక.. మగవారిపై బల్లి పడితే ఎలాంటి ప్రభావం చుపుతుందో ఇపుడు చూద్దాం. మగవారి వీపు కుడి వైపు బల్లి పడితే రాజ భయం కలుగుతుంది. అంటే మన పై అధికారులనుంచి కాని ..మనల్ని శాశించే వారినుంచి కాని ఏదో తెలియని కీడు జరుగుతుంది. చేతి మనికట్టిపై పడితే .. అలంకార ప్రాప్తి కలుగుతుంది. ఇక.. మగవారి మోచేయిని బల్లి తాకితే ఆర్దిక నష్టం వాటిల్లె అవకాశం ఉంది. చేతి వ్రేళ్ళ ను తాకితే అకస్మాత్తుగా బంధువుల, స్నేహితులు వస్తున్నారని సూచన. ఇక.. ఎడమ భుజం పై బల్లి పడితే పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అలాగే కుడి భుజంపై పడితే అనేకా కస్టాలు ఎదురవుతాయి. ఇక.. మగవారు కూర్చున్నపుడు తొడలపై బాలి పడిందనుకోండి అతనికి సంభందించిన బట్టలు ఏదో ఒకవిధంగా నాశనమవుతాయి. ముఖ్యంగా . మగవారి మీసాలను పొరపాటున బల్లి తాకినట్లయితే విపరీతమయిన కష్టాలు వెంటాడుతాయి.కాలి వేళ్ళ పై పడితే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.,పాదాలపై బల్లి పడితే .. దూరపు ప్రయాణాలు సంభవించవచ్చు. ఇక.. మగవారి శిరస్సుపై భాగాన బల్లి పడితే మరణం వెంటాడుతున్నట్లు సూచన. నిద్రపోయేటప్పుడు ముఖంఫై పడితే ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు. ఇక.. ఎడమ కన్నుపై పడితే శుభం జరగబోతోందని అర్ధం. కుడి కన్నును బల్లి తాకితే పనుల్లో అపజయానికి సూచన. నుదుటిపై పడితే అనుకోని సమస్యల్లో చిక్కుకోవడం జరుగుతుంది. పై పెదవిని బల్లి తాకినట్లయితే గొడవలు వస్తాయని సూచన. కింది పెదవిని తాకితే లాభాధయకమైన ఆదాయం వస్తుంది. ఇక.. మగవారి వీపు ఎడమ భాగం పై బల్లి పడితే విజయం సిద్ధిస్తుందని సూచన.బల్లి శాస్త్రం ప్రకారం బల్లి స్త్రీలపై , మగవారిపై పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు నమ్మిన వారు కొందరుంటే .. నమ్మని వారు కొంతమంధి ఉంటారు.ఏది ఏమయినా శాస్త్రాలను గౌరవించడం మానవులుగా మన ధర్మం.

ALSO READ:SHABARIMALA: శబరిమల అయ్యప్ప సన్నిదిలొ ఈ వాక్యాన్ని గమనించారా ?

Advertisment
Advertisment
తాజా కథనాలు