New Update
Coriander Leaves: వంటకి మంచి రుచి రావాలంటే అందులో వేసే పదార్థాలని బట్టి ఉంటుంది. అవి తాజాగా ఉంటే కూరలు కూడా టేస్టీగా ఉంటాయి. అలాంటి వాటిలో కొత్తిమీర ఒకటి. కొత్తిమీరని మనం వంటల్లో వాడితే వాటి రుచి అమాంతం పెరుగుతుంది.కొత్తిమీర కొనేటప్పుడు వేర్లతో సహా కొంటే వాటిని ఇంటికి తీసుకురాగానే కట్ చేయొద్దు. ముందుగా కొత్తిమీరని చక్కగా కడగాలి. తర్వాత ఆకులని క్లీన్ చేయాలి. తర్వాత దానిని పూర్తిగా ఆరనివ్వండి. దానికోసం ఓ గిన్నె, కాగితంలో వేసి ఆరనివ్వండి.
తర్వాత గాలి చొరబడని గాజు కంటెయినర్ తీసుకోండి. దీనిని చక్కగా నీరు లేకుండా తుడిచి ఆరబెట్టండి. నీరు ఉంటే కొత్తిమీర కుళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఆ కంటెయినర్‌లో మిగతా భాగాల్లో నీరు పడకుండా అడుగున మాత్రమే పోయేలా నీటిని పైనుంచి పోయండి. ఎందుకంటే పైనున్న ఆకులపై నీరుపడితే త్వరగా కుళ్ళిపోతుంది. ఇప్పుడు వేర్లు మాత్రమే మునిగేలా మాత్రమే కొత్తిమీరని ఆ కంటెయినర్‌లో పెట్టండి. కొత్తిమీర ఆకులు జాడీలో పెట్టేసి మూతపెట్టండి.
Advertisment