Coriander: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి! కొత్తిమీర కూరల్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కానీ, దీనిని ఎక్కువగా తీసుకొచ్చి పెట్టుకుంటే త్వరగా వాడిపోతుంది. అలాకాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వీటి వల్ల కొత్తిమీర కనీసం 15 రోజులపైనే తాజాగా ఉంటుంది. అందుకోసం ఏంచేయాలంటే.. By Durga Rao 25 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Coriander Leaves: వంటకి మంచి రుచి రావాలంటే అందులో వేసే పదార్థాలని బట్టి ఉంటుంది. అవి తాజాగా ఉంటే కూరలు కూడా టేస్టీగా ఉంటాయి. అలాంటి వాటిలో కొత్తిమీర ఒకటి. కొత్తిమీరని మనం వంటల్లో వాడితే వాటి రుచి అమాంతం పెరుగుతుంది.కొత్తిమీర కొనేటప్పుడు వేర్లతో సహా కొంటే వాటిని ఇంటికి తీసుకురాగానే కట్ చేయొద్దు. ముందుగా కొత్తిమీరని చక్కగా కడగాలి. తర్వాత ఆకులని క్లీన్ చేయాలి. తర్వాత దానిని పూర్తిగా ఆరనివ్వండి. దానికోసం ఓ గిన్నె, కాగితంలో వేసి ఆరనివ్వండి. తర్వాత గాలి చొరబడని గాజు కంటెయినర్ తీసుకోండి. దీనిని చక్కగా నీరు లేకుండా తుడిచి ఆరబెట్టండి. నీరు ఉంటే కొత్తిమీర కుళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఆ కంటెయినర్‌లో మిగతా భాగాల్లో నీరు పడకుండా అడుగున మాత్రమే పోయేలా నీటిని పైనుంచి పోయండి. ఎందుకంటే పైనున్న ఆకులపై నీరుపడితే త్వరగా కుళ్ళిపోతుంది. ఇప్పుడు వేర్లు మాత్రమే మునిగేలా మాత్రమే కొత్తిమీరని ఆ కంటెయినర్‌లో పెట్టండి. కొత్తిమీర ఆకులు జాడీలో పెట్టేసి మూతపెట్టండి. మరో విధంగా కూడా కొత్తిమీరని ఎక్కువరోజులు స్టోర్ చేసుకోవచ్చు. కొత్తిమీరని ముందుగా బాగా కడిగి ఆరబెట్టండి. నీరు లేకుండా చూడండి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన కొత్తిమీరని ఓ కంటెయినర్‌లో టిష్యూ పేపర్ వేసి అందులో పెట్టండి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టండి. దీని వల్ల కొత్తి కొత్తిమీర రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. పైన మరో టిష్యూ పేపర్ వేసి కంటెయినర్‌ని మూసేయండి. దీని వల్ల కొత్తిమీర తేమ లేకుండా తాజాగా చాలా రోజుల వరకూ ఉంటుంది. Also Read: ‘ఆర్గానిక్’ ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్! #coriander మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి
తర్వాత గాలి చొరబడని గాజు కంటెయినర్ తీసుకోండి. దీనిని చక్కగా నీరు లేకుండా తుడిచి ఆరబెట్టండి. నీరు ఉంటే కొత్తిమీర కుళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఆ కంటెయినర్‌లో మిగతా భాగాల్లో నీరు పడకుండా అడుగున మాత్రమే పోయేలా నీటిని పైనుంచి పోయండి. ఎందుకంటే పైనున్న ఆకులపై నీరుపడితే త్వరగా కుళ్ళిపోతుంది. ఇప్పుడు వేర్లు మాత్రమే మునిగేలా మాత్రమే కొత్తిమీరని ఆ కంటెయినర్‌లో పెట్టండి. కొత్తిమీర ఆకులు జాడీలో పెట్టేసి మూతపెట్టండి. మరో విధంగా కూడా కొత్తిమీరని ఎక్కువరోజులు స్టోర్ చేసుకోవచ్చు. కొత్తిమీరని ముందుగా బాగా కడిగి ఆరబెట్టండి. నీరు లేకుండా చూడండి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన కొత్తిమీరని ఓ కంటెయినర్‌లో టిష్యూ పేపర్ వేసి అందులో పెట్టండి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టండి. దీని వల్ల కొత్తి కొత్తిమీర రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. పైన మరో టిష్యూ పేపర్ వేసి కంటెయినర్‌ని మూసేయండి. దీని వల్ల కొత్తిమీర తేమ లేకుండా తాజాగా చాలా రోజుల వరకూ ఉంటుంది. Also Read: ‘ఆర్గానిక్’ ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్!