ధూమపానం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని చంపుతుంది. వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా చాలా మంది సిగరెట్ తాగుతున్నారు.
ఇటీవలి అధ్యయనాలు ధూమపానానికి ఎక్కువ మంది యువత బానిస అవుతున్నారని అంటున్నాయి. స్నేహితుల ఒత్తిడి యువతను స్మోకింగ్ వైపు మళ్లిస్తోంది. స్మోకింగ్ ఫ్యాషన్‌గా మారింది.
తల్లిదండ్రులు ధూమపానం చేస్తే వారి పిల్లలు కూడా ధూమపానం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ప్రకటనలు ధూమపానాన్ని ఆకర్షణీయమైన అలవాటుగా చూపడం కూడా ఒక కారణం.
ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవటానికి యువత ధూమపానాన్ని ఆశ్రయిస్తారు. చాలా మంది యువత కేవలం ఉత్సుకతతో పొగతాగుతున్నారు. స్నేహితుల ముందు చులకన కాకూడదని, అమ్మాయిల ముందు ఫోజు కొట్టేందుకే సిగరెట్లు తాగుతుంటారు యువత.
దేశం, సంస్కృతి, సామాజిక-ఆర్థిక స్థితి వంటివి ధూమపానానికి కూడా ఒక కారణం. అయితే సాధారణంగా చాలా అధ్యయనాలు టీనేజర్లు, యువకులు ధూమపానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయి.
ముఖ్యంగా 15-24 సంవత్సరాల వయస్సు గలవారు సిగరెట్లు తాగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వయస్సులో సామాజిక ఒత్తిడి, గుర్తింపు కోసం, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా ఉండటంతో యువతను ధూమపానం వైపు మొగ్గుచూపుతున్నారు.