/rtv/media/media_files/2025/11/03/walking-benefits-2025-11-03-13-22-50.jpg)
Walking Benefits
Walking Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ నడక చాలా ముఖ్యమని వైద్యులు చెబుతారు. భోపాల్‌కి చెందిన న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ రేణు రఖేజా కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో “జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సులభంగా చేయగలిగే ఐదు రకాల వాక్స్ మీ శరీరాన్ని బలంగా, సరైన పద్దతిలో ఉంచుతాయి” అని తెలిపారు.
టో వాక్ (పాదాల వేళ్లపై నడక)
“ఈ వాక్ మీ భంగిమను(posture) మెరుగుపరుస్తుంది, కాళ్లకు శక్తినిస్తుంది” పాదాల వేళ్లపై నడవడం కాళ్ల కండరాలను బలపరుస్తుంది. రోజుకు ఒక్క నిమిషం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
హీల్ వాక్ (పాదాల మడమలపై నడక)
ఈ నడక మడమల బలాన్ని పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎక్కువ సేపు కూర్చునే వారికి ఇది చాలా ఉపయోగకరం. కాళ్ల ఉబ్బరాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
హిప్ రొటేషన్ వాక్
ఈ వాక్‌తో నడుము, కండరాలు సడలుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే గట్టిదనాన్ని తగ్గిస్తుంది. వెన్ను నొప్పి ఉన్నవారికి ఇది ఉపశమనం ఇస్తుంది.
సైడ్ టు సైడ్ వాక్ (పక్కకి నడక)
“థైస్ టోన్ అవుతాయి, హిప్స్ బలపడతాయి”. ఈ వాక్ కింది భాగంలోని కండరాలను బలపరుస్తూ శరీర సంతులనం పెంచుతుంది. ఫిట్‌నెస్ మెరుగుపరచాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
రివర్స్ వాక్ (వెనక్కి నడక)
వెనక్కి నడవడం మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. ఇది మోకాళ్ల నొప్పిని తగ్గించి శరీర అవగాహనను పెంచుతుంది. రోజుకు 2–5 నిమిషాలు చేస్తే చాలు. “ఈ వాక్స్ మీ రోజువారీ జీవితంలో సులభంగా చేయగలిగేవి. ఏ తంటా లేకుండా ఆరోగ్య ఫలితాలు అందిస్తాయి”
Follow Us