/rtv/media/media_files/2025/10/02/vijayadashami-2025-2025-10-02-07-15-15.jpg)
Vijayadashami 2025
ఈరోజు దేశవ్యాప్తంగా దసరా పండగ వేడుకలు జరుపుకుంటున్నారు. దసరా పండగను విజయదశమి అని కూడా అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి పండగను జరుపుకుంటారు. మాత విశ్వసాల ప్రకారం.. శ్రీరాముడు రావణుడిని వధించి లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చింది కూడా దశమి రోజే అని చెబుతారు. అలాగే ఇదేరోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి రాక్షసుల నుంచి లోకాన్ని రక్షించిందని నమ్ముతారు. ఇలా చెడు పై మంచి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దశమి రోజున విజయ దశమి పండగ జరుపుకుంటారు.
ఈరోజు దసరా పండగ సందర్భంగా పూజ విధానం, రావణ దహనానికి శుభ సమయం, పూజ చేయడానికి శుభ సమయం గురించి ఇక్కడ తెలుసుకోండి...
శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం.. దశమి తిథి అక్టోబర్ 1న సాయంత్రం 7:01 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 2న సాయంత్రం 7:10 గంటలకు ముగుస్తుంది. ఈరోజు ఇంట్లో దేవతలను పూజించడానికి మధ్యాహ్నం 2:09 నుంచి 2:56 వరకు అత్యంత శుభ సమయమని పండితులు చెబుతున్నారు.
రావణ దహనానికి ప్రదోష కాలం శుభ సమయంగా భావిస్తారు. ప్రదోష కాలం అంటే.. సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది.
పూజా ఆచారం
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత శుభ్రంగా తలంటు స్నానం చేసి.. కొత్త బట్టలు వేసుకోవాలి.
ఆ తరువాత ఇంట్లోని పూజా మందిరాన్ని గంగా జలంతో శుద్ధి చేయాలి. అలాగే దేవుళ్ళ పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి.
ఇప్పుడు పూజ గదిలో దుర్గాదేవి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ఉంచి.. ముందుగా దీపారాధన చేయండి.
ఆ తర్వాత దేవికి సింధూరం, బియ్యం గింజలు, ఎర్రటి పువ్వులు, కొబ్బరికాయలు, స్వీట్లు, పండ్లను నైవేద్యంగా సమర్పించండి. పూజలో అమ్మవారికి ఎర్రటి కండువాను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ తర్వాత దుర్గా చాలీసా, రామ రక్ష స్తోత్రం, దుర్గా మంత్రాలను కుటుంబంతో కలిసి పటించడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది.
ఆయుధ పూజ
దసరా పండగ నాడు మీరు వాడే పనిముట్లు, పుస్తకాలు, వాహనాలకు ఆయుధ పూజ జరిపించండి. ఇలా చేయడం విజయం, రక్షణకు చిహ్నంగా భావిస్తారు.
ఉదయం పూజలు ముగిసిన తర్వాత.. సాయంత్రం వేల రావణుడు దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా రావణ దహనాన్ని చేస్తారు.
శమీపూజ
దసరా రోజున శమీ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శమీ వృక్షాన్ని జమ్మి చెట్టు అని కూడా అంటారు. పురాణాల ప్రకారం.. జమ్మి చెట్టును దుర్గాదేవి రూపంగా భావిస్తారు. కావున విజయదశమి నాడు జమ్మి పూజ చేయడం ద్వారా కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి.. విజయాలు చేకూరుతాయని నమ్ముతారు.