/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-23T135356.315-jpg.webp)
ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు యూరినరీ ట్రాక్ట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట, జ్వరం, రక్తస్రావం, దుర్వాసన వంటివి వస్తుంటాయి. మూత్రం వెళ్లిన తర్వాత యోనిని శుభ్రం చేసుకోకపోవడం, అతి తక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడిన కొందరికి ఈ సమస్య తగ్గదు. ఇంట్లో దొరికే పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఆలస్యం చేయవద్దు
వేప ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. నాలుగు వేపాకులను గ్లాసు నీటిలో వేసి గోరువెచ్చగా మరిగించుకోవాలి. ఈ వాటర్‌ను తాగితే మూత్రనాళం నుంచి బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. మూత్రం వెళ్లిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రం చేసుకోవాలి. తక్కువగా నీరు తీసుకోకుండా.. రోజుకి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడంతో పాటు కాన్‌బెర్రీస్ జ్యూస్, పండ్లు ఎక్కువగా తినాలి. మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి యూరిన్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్లాలి. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత అనేది తప్పనిసరి. రోజుకి కనీసం రెండుసార్లు అయిన లో దుస్తులు మార్చాలి. అప్పుడే యూరిన్ ఇన్ఫెక్షన్‌కి చెక్ పెట్టవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.