Today Horoscope: దరిద్రమంటే ఈ రాశులవారిదే.. తీరని అప్పులు.. కష్టాలు.. ఆ రాశులేవంటే?

నేడు కొన్ని రాశుల వారికి చెడు జరగనుంది. నిజానికి దరిద్రమంటే ఈ రాశులవారిదే. ఎందుకంటే ఏ పని తలపెట్టినా కూడా సమస్యలు వస్తాయి. అసలు ప్రశాంతత ఉండదని పండితులు అంటున్నారు. అయితే ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం. 

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేషం 

మీకు ఆకస్మికంగా డబ్బు వస్తుంది. ఇంట్లో సంతోషం, ఉత్సాహం ఉంటాయి. బంధువులు, స్నేహితులను కలుసుకుంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతి విషయంలోనూ అభివృద్ధి కనిపిస్తుంది. శుభకార్యాలు త్వరగా నెరవేరతాయి.

వృషభం 
శుభకార్యాలు సులభంగా పూర్తి అవుతాయి. దూరపు బంధువులను కలుస్తారు, దానివల్ల లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని పనులలో విజయం సాధిస్తారు.

మిథునం
రుణం కోసం చేసే ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. స్థలం మారే సూచనలు ఉన్నాయి. శుభకార్యాల కారణంగా డబ్బు ఖర్చు పెరుగుతుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం 
మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. గతంలో వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగం/వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని కష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సింహం
మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. కొత్త వస్తువులు, నగలు కొనుక్కుంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మంచి వార్తలు వింటారు. ధైర్యంగా పనులు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

కన్య 
బంధువులు, స్నేహితులను కలుస్తారు. కొత్త ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తారు. ఆకస్మిక ధనలాభంతో అప్పుల బాధలు తొలగిపోతాయి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. శత్రువుల బాధలు, పాత సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల 
డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

వృశ్చికం 
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మానసిక ఆందోళన తగ్గడానికి దేవుడి ధ్యానం అవసరం. కొద్దిగా అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు అంత సంతృప్తికరంగా ఉండవు. అనవసర ప్రయాణాలు, డబ్బు ఖర్చు పెరుగుతాయి.

ధనుస్సు 
కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి అప్పు కోసం ప్రయత్నిస్తారు. బంధువులు, స్నేహితుల సహాయం ఆలస్యంగా లభిస్తుంది.

మకరం
బంధువులు, స్నేహితులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొద్దిగా అనారోగ్య బాధలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో సమయం గడుస్తుంది. బాగా ప్రయత్నించినా పనులు పూర్తి చేసుకోలేరు.

కుంభం
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. తలపెట్టిన పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది.

మీనం 
వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అన్నిచోట్లా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

Advertisment
తాజా కథనాలు