/rtv/media/media_files/2025/07/11/today-horoscope-2025-07-11-06-26-01.jpg)
Today Horoscope
మేషం
డబ్బు విషయంలో మీరు పెట్టిన కష్టం ఫలిస్తుంది. కొత్తగా మొదలుపెట్టిన పనులు విజయం సాధిస్తాయి. కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చినా ఫలితాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి.
వృషభం
మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతాయి. మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, ఇష్టులతో గడపడం ఆనందాన్ని ఇస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి.
మిథునం
ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉన్నా.. మీ తెలివితేటలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం ఖాయం.
కర్కాటకం
మీరు చేసే కృషికి తగిన ఫలితం దక్కుతుంది. మీ పెద్దలు, ఆత్మీయులు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
సింహం
మీరు నిజాయితీ, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. అనవసర విషయాల గురించి ఆలోచించకుండా ఉండడం మంచిది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లండి.
కన్య
ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో మంచి వార్తలు వింటారు. సమయపాలన పాటిస్తే మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. విష్ణు ఆలయాన్ని సందర్శిస్తే శాంతి, శుభం కలుగుతాయి.
తుల
మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది. ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
వృశ్చికం
బంధుమిత్రుల సహాయంతో కొత్త పథకాలు మొదలవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉత్సాహం పెరిగి పనులు వేగంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా చదవడం మీకు మంచి చేస్తుంది.
ధనుస్సు
మీ భవిష్యత్తు ప్రణాళికలపై ఈరోజు ప్రత్యేక దృష్టి పెడతారు. అధికారులతో సున్నితంగా మాట్లాడండి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిద్ర, ఆహారం విషయంలో క్రమబద్ధత పాటించండి.
మకరం
మీ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఒక ముఖ్యమైన విషయం గురించి ఉన్నతాధికారులను కలుస్తారు. మంచి నిర్ణయాలు వెలువడతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి.
కుంభం
మీతో పాట పనిచేసే వారి సహకారంతో పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలు విని మీ మనోధైర్యం పెరుగుతుంది.
మీనం
స్పష్టమైన ఆలోచనలతో మీ సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్న విభేదాలు త్వరగా తగ్గిపోతాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోండి. అదృష్టం మీవైపే ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.