Today Horoscope: నేడు ఈ రాశుల వారికి యమ డేంజర్.. ఏ పని చేపట్టినా ఆటంకమే!

నేడు కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవు. ఏ పని చేపట్టినా కూడా ఏదో ఒక సమస్య రాబోతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు అంటున్నారు. అయితే నేడు ఏయే రాశుల వారికి డేంజర్ ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Update
horoscope 2025 today

horoscope today

మేషం

సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఇతరుల సలహాలు పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే మీకు అవసరం ఉన్న పనుల్లో మాత్రమే తలదూర్చండి. ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు కాస్త ఆలోచించండి. ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

వృషభం 
నేడు ఏ పని చేపట్టినా మంచిగా జరుగుతుంది. ఎంతో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. కాకాపోతే కొన్ని పనులు ప్రారంభించే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు అంటున్నారు. 

మిథునం 
మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ధైర్యం కోల్పోకుండా ఉండాలి. మీ తోటివారి సహాయం మీకు మేలు చేస్తుంది. దేవుడిపై నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. దుర్గా స్తోత్రం చదవడం మీకు మంచిది.

కర్కాటకం 
మీరు కొత్తగా ప్రారంభించబోయే పనుల్లో కాలానికి అనుగుణంగా ముందుకు సాగండి. మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. హనుమంతుడిని ఆరాధించడం మీకు శుభప్రదం.

సింహం 
వృత్తి, ఉద్యోగాలలో మీరు కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులలో వెనకడుగు వేయకండి. మీరు వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలి. మీరు తీసుకునే స్థిరమైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.

కన్య
ఈ రోజు మీకు అనుకూలమైన సమయం. మీ తోటివారి నుండి మీకు సహాయం లభిస్తుంది. మీ తెలివితో మీరు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గణపతిని ఆరాధించడం శుభప్రదం.

తుల 
మీరు కొత్తగా ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదవడం మంచిది.

వృశ్చికం
మీరు ఉత్సాహంగా పని చేయాలి. మీ బంధువుల నుండి మీకు సహాయం లభిస్తుంది. మీరు ఏ పని ప్రారంభించినా మీ కుటుంబ సభ్యులతో చర్చించి చేయాలి. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మీకు మంచి జరుగుతుంది.

ధనుస్సు 
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ధైర్యంతో ముందుకు సాగాలి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ మీరు ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.

మకరం
మీరు ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. గొప్ప వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దేవుడి ఆశీర్వాదం మీకు పూర్తిగా ఉంది. సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం మీకు శుభదాయకం.

కుంభం
మీరు మానసికంగా చాలా ధృడంగా ఉంటారు. మీరు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బంధువులు, స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పై అధికారుల నుండి మీకు సహాయం లభిస్తుంది. దుర్గాదేవిని దర్శించుకోవడం మీకు శుభకరం.

మీనం
మీ తోటివారి సహకారంతో మీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అనవసర విషయాల కోసం సమయాన్ని వృథా చేయకండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శ్రీరామ నామాన్ని జపించడం మీకు చాలా మంచిది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు