/rtv/media/media_files/2025/01/25/1OMq4QlbeytD7eXzGRTr.jpg)
Horoscope Today
నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు అనని తీరిపోతాయని ఇక అన్ని విధాలుగా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే నేడు ఏయే రాశి వారికి మంచి జరగనుందో ఈ స్టోరీలో చూద్దాం.
మేషం
ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో కుటుంబం సాయంగా ఉంటుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయవద్దు. ముఖ్యంగా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
వృషభం
వ్యాపారంలో కొద్దిగా లాభాలు ఉంటాయి. మీకు ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. కుటుంబంతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. సూర్య ధ్యానం మంచిది.
మిథునం
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీ పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. మీ మాట విలువను కాపాడుకోండి. సమస్యగా అనిపించే పనులను ముందుగా పూర్తి చేయండి. మనశ్శాంతి అవసరం.
కర్కాటకం
ఉద్యోగంలో మీరు కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీరు ప్రారంభించిన పనులలో మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య ధ్యానం శుభప్రదం.
సింహం
మీరు మొదలు పెట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ ధ్యానం మంచిది.
కన్య
ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం. శత్రువుల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఒక చెడ్డ వార్త మిమ్మల్ని బాధపెట్టవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నవగ్రహ ఆలయాన్ని సందర్శించడం మంచిది.
తుల
మీరు అనుకున్న ఫలితాలు పొందడానికి ఇది మంచి సమయం. గ్రహబలం చాలా బాగుంది. ఉద్యోగం, వ్యాపారం అన్నింట్లోనూ లాభాలు ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా సులభంగా పూర్తవుతుంది. మీకు అన్నివిధాలా కాలం సహకరిస్తుంది. ఇష్టమైన దేవుడిని దర్శించుకోవడం మంచిది.
వృశ్చికం
ఉద్యోగంలో విజయావకాశాలు మెరుగవుతాయి. మీ అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మంచి పనులు చేపడతారు. ఉద్యోగం, వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులను కలుపుకుని పనులు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. శని ధ్యానం మంచిది.
మకరం
గ్రహబలం మామూలుగా ఉంది. కాలం అంతగా అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో పట్టుదల అవసరం. మీ మంచి గుణం మిమ్మల్ని ఉన్నతంగా ఉంచుతుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహార నియమాలు పాటించాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కుంభం
దేవుడి దయతో మీరు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. స్థిరమైన మనసుతో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఉద్యోగం, వ్యాపారంలో ముందుచూపుతో వ్యవహరించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శని ధ్యానం మంచిది.
మీనం
ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం అవసరం. ఒక వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామావళి చదవడం మంచిది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.