Tirumala Laddu: కల్తీ నెయ్యిని ఈ పరీక్షలతో గుర్తించండి..? తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే వార్త దేశవ్యాప్తంగా భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కల్తీ నెయ్యిని ఇంట్లోనే కొన్ని సింపుల్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అవేంటో ఆర్టికల్ లో తెలుసుకోండి. By Archana 21 Sep 2024 in లైఫ్ స్టైల్ Short News New Update ghee షేర్ చేయండి 1/8 తిరుమల శ్రీవారి ఆలయంలో తయారు చేసే లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే వార్త దేశవ్యాప్తంగా భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. 2/8 దేవస్థానాల్లో జరుగుతున్నట్లే మార్కెట్లలో కొనుగోలు చేసే చాలా రకాల నెయ్యిలలో కూడా కల్తీ జరుగుతోంది. స్వచ్ఛమైన నెయ్యి కంటే కూడా అందులో కల్తీనే ఎక్కువ భాగం ఉంటుంది. 3/8 అయితే మార్కెట్లలో విక్రయించే నెయ్యిలో స్వచ్ఛమైన దానిని గుర్తించడానికి కొన్ని రకాల టెస్టులు ఉన్నాయి. వాటిని ఇంట్లోనే సింపుల్ గా చేసేయవచ్చు. ఆ టెస్టులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 4/8 లేబుల్: ప్రతీ వస్తువును కొనే ముందు లేబుల్ జాగ్రత్తగా చదవాలి. వాటిలో ముఖ్యమైనది నెయ్యి. లేబుల్ చూడడం ద్వారా నెయ్యిలో కల్తీ పదార్థాలు ఉన్నాయా? లేదా ? అనే విషయం అర్థం అవుతుంది. 5/8 నెయ్యి ప్యాకెట్ లేబుల్ పై జెలటిన్ అనే పదార్థం రాసి ఉంటే.. వాటికీ దూరంగా ఉండండి. జెలటిన్ మాంసాహార పదార్ధాన్ని సూచిస్తుంది. జెలటిన్ పదార్ధంలో జంతువుల ఎముకలను ఉపయోగిస్తారు. అందువల్ల ఇలాంటి పదార్థం ఉన్న నెయ్యిని తినడం ఆరోగ్యానికి హానికరం. 6/8 స్టార్చ్ టెస్ట్ ఒక గిన్నెలో చెంచా నెయ్యి తీసుకొని.. ఇప్పుడు దీంట్లో 3 నుంచి 4 చుక్కల అయోడిన్ వేయండి. నెయ్యి రంగు పర్పుల్ రంగులోకి మారితే నెయ్యిలో కల్తీ జరిగినట్లు సూచిస్తుంది. 7/8 నెయ్యిని వేడి చేయడం నెయ్యిని వేడి చేయడం ద్వారా స్వచ్ఛమైనదా..? కాదా? అని తెలుసుకోవచ్చు. పాన్ పై ఒక చెంచా నెయ్యి వేసిన తర్వాత వెంటనే కరిగిపోతే స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ నెయ్యి పొరలుగా కనిపిస్తే .. దానిలో కొంత జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని సూచన. 8/8 షుగర్ టెస్ట్ ఇంట్లో చక్కర సహాయంతోనూ నెయ్యిలో కల్తీని గుర్తించవచ్చు. ముందుగా నెయ్యిని కరిగించి ఒక ట్రాన్ఫరెంట్ పాత్రలో పోయాలి. ఆ తర్వాత దానిలో చిటికెడు పంచదార కలపాలి. ఇప్పుడు గిన్నె మూతను గట్టిగా పెట్టి 5-10 నిముషాలు కదిలించండి. ఆ తర్వాత బాటిల్ దిగువన ఎరుపు రంగు కనిపిస్తే అది కల్తీ నెయ్యి అని అర్థం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి