ఒక్క మస్కిటో కాయిల్ పొగ 100 సిగరెట్లకు సమానం!

చలికాలంలో దోమల బెడద నుండి తప్పించుకోవడానికి చాలామంది ఇళ్లలో మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. ఈ కాయిల్స్ నుంచి వచ్చే పొగ మన ఊపిరితిత్తులను ఎంతగా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. వీటిలోని రసాయనాలు శ్వాస ద్వారా శరీరంలోకి చేరి ఇబ్బందులు కలిగిస్తాయి.

New Update
mosquito coil

చలికాలంలో దోమల బెడద నుండి తప్పించుకోవడానికి చాలామంది ఇళ్లలో మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. అయితే, ఈ కాయిల్స్ నుంచి వచ్చే పొగ మన ఊపిరితిత్తులను ఎంతగా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. తాజాగా ప్రముఖ చెస్ట్ సర్జన్ డాక్టర్ హర్ష్ వర్ధన్ పూరి మస్కిటో కాయిల్స్ వల్ల జరిగే ప్రమాదం గురించి హెచ్చరించారు. మూసి ఉన్న రూమ్‌లో మస్కిటో కాయిల్ వెలిగించడం వల్ల వెలువడే పొగ, సుమారు 100 సిగరెట్లు తాగినప్పుడు వెలువడే 'పర్టిక్యులేట్ మ్యాటర్'తో సమానం అని ఆయన అన్నారు. దోమల నివారణకు వాడే 'ఆల్ అవుట్' వంటి లిక్విడ్ వేపరైజర్లు కూడా మస్కిటో కాయిల్స్ తరహాలోనే ఆరోగ్యానికి ప్రమాదకరమే. ఇవి నేరుగా నిప్పుతో కాలకపోయినా, వీటిలోని రసాయనాలు శ్వాస ద్వారా శరీరంలోకి చేరి ఇబ్బందులు కలిగిస్తాయి.

ఇంట్లోని గాలే నిశ్శబ్ద శత్రువు!

సాధారణంగా మనం బయటి కాలుష్యం నుండి తప్పించుకోవడానికి కిటికీలు, తలుపులు మూసి ఇంట్లో క్షేమంగా ఉన్నామని భావిస్తాం. కానీ, డాక్టర్ పూరి హెచ్చరిక ప్రకారం.. బయటి గాలి కంటే గదుల్లోని గాలి నాణ్యత కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. కాయిల్స్ నుండి వెలువడే పొగలో ఉండే అత్యంత సూక్ష్మమైన కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోని అల్వియోలీ వరకు చేరుతాయి. వీటిలో ఉండే పైరెత్రిన్స్, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మనం రాత్రిపూట 8-, 10 గంటలు నిద్రిస్తున్న సమయంలో ఈ పొగను నిరంతరం పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు విశ్రాంతి లేకుండా పోతుంది.

మస్కిటో కాయిల్స్ క్రమం తప్పకుండా వాడితే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలు, తీవ్రమైన దగ్గు, కళ్ల మంటలు, చర్మ అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది 'నిశ్శబ్ద విషం' లాంటిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమల నుండి రక్షణ పొందేందుకు రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్ రిపెల్లెంట్లకు బదులుగా ఈ క్రింది మార్గాలను అనుసరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో ప్రధానంగా అలెత్రిన్ లేదా ట్రాన్స్‌ఫ్లుత్రిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కీటకాల నాడీ వ్యవస్థను దెబ్బతీసి వాటిని చంపేస్తాయి. మనం గది తలుపులు మూసి వీటిని వాడినప్పుడు, అదే గాలిని మనం కూడా పీలుస్తాము. ఎక్కువ కాలం ఈ వేపర్లను పీల్చడం వల్ల కొందరిలో తలనొప్పి, కళ్లు తిరగడం లేదా ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కళ్లలో మంట, చర్మంపై దురద లేదా గొంతులో గీర రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు