ఈ పండు తింటే వృద్దాప్యం తొందరగా రాదు.. శీతాకాలంలోనే దొరుకుతుంది టెర్మినలియా పండు లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటుంది. ఈ పండ్లలో ఔషధ గుణాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. డిసెంబర్ నెలలోనే ఈ పండ్లు కడుపులోని నులిపురుగులను కూడా తొలగిస్తుంది. By Vijaya Nimma 30 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. టెర్మినలియా చెబులా లేదా హరితకి అనే పండు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. డిసెంబర్ నెలలోనే ఈ పండ్లు వస్తాయి. 2/7 టెర్మినలియా పండు లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటుంది కిలో 500 రూపాయల వరకు పలుకుతుంది. ఈ పండులో యాంటీ ఏజింగ్, యాంటీ హెల్మిన్థిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. 3/7 ఈ చెట్టు 10 నుంచి 15 అడుగుల పొడవు పెరుగుతుంది. ఈ చెట్టు డిసెంబర్ నెలలో మాత్రమే ఫలాలను అందిస్తుంది. ఈ పండ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 4/7 ఆయుర్వేదంలో హరితకి చెట్టు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ పండును అతిగా తింటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందని వైద్యులు అంటున్నారు. 5/7 టెర్మినలియాలో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మధుమేహం నివారణకు ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా యాంటీ హెల్మిన్థిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కడుపులోని నులిపురుగులను కూడా తొలగిస్తుంది. 6/7 హరితకి పండును తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. వీటి గింజలు తింటే మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. ఉడకబెట్టి తింటే డైసెంటెరిక్ పోతుంది. అంతేకాకుండా వాత, పిత్త, కఫా దోషాలు తొలగిపోతాయి. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి