/rtv/media/media_files/2025/02/19/skippingrope7-885444.jpeg)
చక్కటి ఆరోగ్యానికి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. శారీరక శ్రమ లేకుంటే స్థూలకాయంతో పాటు ఇతర సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/02/19/skippingrope10-121312.jpeg)
నిత్యం చిన్న వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఒకటి స్కిప్పింగ్. కొందరు జిమ్‌లలో వర్కౌట్స్ చేస్తుంటారు. అయితే సమయం లేక కొందరు చేయలేక పోతుంటారు. అలాంటి వారికి స్కిప్పింగ్ ఒక మంచి ఎంపిక.
/rtv/media/media_files/2025/02/19/skippingrope1-764089.jpeg)
జిమ్‌లలో చేసే వర్కౌట్స్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో కేవలం స్కిప్పింగ్‌తో కూడా అన్నే ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు
/rtv/media/media_files/2025/02/19/skippingrope4-778750.jpeg)
స్కిప్పింగ్ చేయడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయి. స్కిప్పింగ్ అనేది బరువు తగ్గాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది. శరీరంలో అదనపు కేలరీలన్నీ కరిగిపోతాయని వైద్యులు అంటున్నారు
/rtv/media/media_files/2025/02/19/skippingrope8-624981.jpeg)
స్కిప్పింగ్ వల్ల నిమిషానికి 20 కేలరీలను బర్న్ చేయవచ్చు. స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం, హార్ట్‌బీట్ రేటు బాగా పెరుగుతుంది. గుండె ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
/rtv/media/media_files/2025/02/19/skippingrope6-118076.jpeg)
స్కిప్పింగ్ మెదడుకు కూడా చాలా మంచిది. జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను అందజేస్తుంది.. ఇది మెదడు పనితీరును మెరుగుపడుతుంది. స్పిప్పింగ్ చేసేటప్పుడు శరీరం బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. రోజూ స్కిప్పింగ్ చేస్తే శరీరం హుషారుగా మారుతుంది.
/rtv/media/media_files/2025/02/19/skippingrope5-387568.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.