Sperm Health: తండ్రి అలవాట్లు పుట్టబోయే బిడ్డకు శాపమా..? స్పెర్మ్ హెల్త్ పై షాకింగ్ రిపోర్ట్స్..

తండ్రుల జీవనశైలి (ఆహారం, ధూమపానం, ఒత్తిడి, రసాయనాల ప్రభావం) వారి స్పెర్మ్‌లో ఎపిజెనిటిక్ మార్పులకు కారణమవుతుంది. ఇవి బిడ్డల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకర జీవనశైలితో ఈ ముప్పులను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Sperm Health

Sperm Health

Sperm Health: ఇటీవల Clinical Epigenetics అనే ఒక జర్నల్‌లో ప్రచురితమైన సమీక్షలో, తండ్రులు అనుసరిస్తున్న జీవనశైలి, పర్యావరణానికి సంబంధించిన అంశాలు (ఆహారం, అధిక బరువు, ధూమపానం, హార్మోన్లను ప్రభావితం చేసే రసాయనాలు, మానసిక ఒత్తిడి) వారి స్పెర్మ్ లో మార్పులను కలిగిస్తూ, పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయని వెల్లడించారు.

ఈ మిస్టేక్స్ అస్సలు చెయ్యొద్దు..!!

  • తండ్రుల జీవనశైలి వల్ల స్పెర్మ్‌లో DNA మెథైలేషన్, హిస్టోన్ మార్పులు, చిన్న RNAలు వంటి ఎపిజెనిటిక్ మార్పులు జరుగుతాయి.
  • అధిక కొలెస్ట్రాల్ లేదా చక్కెర ఉన్న ఆహారం, ఫోలేట్ కొరత వంటి డైట్‌లు స్పెర్మ్ నాణ్యతను తగ్గించి, పిల్లల్లో మెటబాలిక్ సమస్యలకు దారితీస్తాయి.
  • ధూమపానం వలన స్పెర్మ్ DNAలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీ తగ్గించడమే కాకుండా, పిల్లల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
  • BPA, ఫథాలేట్స్ వంటి హార్మోన్లను దెబ్బతీసే కెమికల్స్ వల్ల స్పెర్మ్‌ లో భారీ మార్పులు కలగవచ్చు.
  • తండ్రుల్లో ఒత్తిడి కూడా స్పెర్మ్‌కి మార్పులు తేవడమే కాకుండా, వారి పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు, మెటబాలిక్ సమస్యలు కలుగవచ్చునని జంతువులపై చేసిన అధ్యయనాల్లో తేలాయి.

Also Read: డేంజర్..!! వీటిని వాడడం ఆపండి లేదంటే క్యాన్సర్ కన్ఫర్మ్..!

ART (Assisted Reproductive Technologies) పై ప్రభావం:

తండ్రి బరువు, ఆహారం, మద్యం అలవాటు వంటి అంశాలు ఎంబ్రియో నాణ్యతపై ప్రభావం చూపుతాయి. స్పెర్మ్‌లో ఎపిజెనిటిక్ మార్పులను పరీక్షించడం ద్వారా IVF/ICSI విజయాన్ని మెరుగుపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆరోగ్యమైన సంతానం కోసం తండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు: (Tips for Sperm Health)

  • శరీర బరువును నియంత్రించుకోవాలి.
  • ధూమపానం, మద్యం నివారించాలి.
  • పోషకాహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఫోలేట్‌ను పుష్కలంగా పొందాలి.
  • ప్లాస్టిక్‌లు, ఇతర హానికర రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి.
  • ఒత్తిడిని తగ్గించుకొని, నిద్ర, వ్యాయామం ప్రాధాన్యత ఇవ్వాలి.

తండ్రుల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. తండ్రులు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం వల్ల, ఆరోగ్యకరమైన శిశువుల పుట్టుకకు దోహదం చేస్తుంది. భవిష్యత్తులో దీనిపై మరిన్ని పరిశోధనలు, వైద్య పరీక్షలు అవసరం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Advertisment
తాజా కథనాలు