/rtv/media/media_files/2025/03/24/onions8-180095.jpeg)
రోజూ వంటల్లో ఏదో ఒక విధంగా ఉల్లిపాయలను ఉపయోగిస్తాం. ఇవి వంటలకు రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచివి. సాధారణంగా ఉల్లిపాయలను ఉడికించి లేదా వేయించి వంటలో ఉపయోగిస్తారు. కానీ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
/rtv/media/media_files/2025/03/24/onions9-390099.jpeg)
పచ్చి ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఉల్లిపాయలను రోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్‌ను తగ్గించవచ్చు.
/rtv/media/media_files/2025/03/24/onions10-275272.jpeg)
ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పచ్చి ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
/rtv/media/media_files/2025/03/24/onions7-571856.jpeg)
పచ్చి ఉల్లిపాయల్లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఫ్లేవనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
/rtv/media/media_files/2025/03/24/onions6-706312.jpeg)
పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలు ఫైబర్, ప్రీబయోటిక్స్ అద్భుతమైన మూలంగా పరిగణించబడతాయి. ఇవి పేగు ఆరోగ్యానికి చాలా అవసరం.
/rtv/media/media_files/2025/03/24/onions3-445078.jpeg)
ఉల్లిపాయలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది
/rtv/media/media_files/2025/03/24/onions5-310160.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.