/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice10-802896.jpeg)
గుమ్మడికాయ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. దీని రసం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయ రసంలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి.
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice4-607682.jpeg)
ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా తరచుగా వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది.
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice1-216013.jpeg)
గుమ్మడికాయ రసంలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి కొవ్వును తగ్గిస్తుంది.
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice5-993878.jpeg)
చర్మ ఆరోగ్యానికి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది. కడుపు మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో గుమ్మడికాయ రసం సహాయపడుతుంది. ఇది చర్మం అందంగా ఉండటానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice9-237839.jpeg)
ఇది ముడతలు, మచ్చలను నివారిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice7-221330.jpeg)
గుమ్మడికాయ రసానికి కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి. గుమ్మడికాయ రసం తయారు చేయడానికి ముందుగా గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేయండి. అర గ్లాసు నీరు వేసి కలపండి. తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు.
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice3-580888.jpeg)
గుమ్మడికాయ రసాన్ని ఉదయం పరగడుపున తాగితే శరీరం శుభ్ర పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు
/rtv/media/media_files/2025/03/24/pumpkinjuice2-994096.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.