తల్లి కావడం అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన అనుభూతి. అయితే కొన్నిసార్లు వైద్య కారణాల వల్ల మహిళలు గర్భం ధరించలేరు. ముఖ్యంగా నేటి జీవనశైలి కారణంగా ప్రపంచంలో సంతానలేమి పెరిగిపోయింది.
ప్రెగ్నెన్సీ వెల్..
అయితే, సంతానం విషయంలో చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఉన్న ఓ బావిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ బావిని ప్రెగ్నెన్సీ వెల్ అని అంటారు. ఈ బావి నీటిని తాగితే.. స్త్రీ గర్భవతి అవుతుందట. అయితే, ఇది ఏ మాత్రం మంత్రం, అద్భుతం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని వెనుక సైన్స్ దాగి ఉందంటున్నారు. ఇక్కడ మూడు రెండు బావులు ఉన్నాయి.. ఒకదానిలో నీళ్లు తాగితే అబ్బాయిలు పుడతారట. ఇంకొక బావిలో నీళ్లు తాగితే ఆడపిల్లలు పుడతారట. రెండు బావులలో నీటిని కలిపి తాగితే వారికి కవలలు పుడతారని చెబుతున్నారు.