/rtv/media/media_files/2025/05/04/ice6-788853.jpeg)
చాలా మంది ఐస్ ముక్కను నేరుగా నోట్లో వేసేసుకుంటారు. ఈ అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. ఇది వేసవితాపం నుంచి తక్షణ ఉపశమనం కలిగించినా దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా శరీర వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశముంది.
/rtv/media/media_files/2025/05/04/ice1-519275.jpeg)
ఐస్‌ను నోటిలో ఉంచడం వల్ల మొదటగా దంతాలకు హాని జరుగుతుంది. ఇది దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసి పగుళ్లను, నొప్పులను కలిగించవచ్చు. ముఖ్యంగా బలహీన దంతాలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
/rtv/media/media_files/2025/05/04/ice3-336591.jpeg)
గొంతు సమస్యలు కూడా వస్తాయి. చల్లదనం వల్ల గొంతులో వాపు, నొప్పి, దగ్గు మొదలవుతాయి. ఐస్ నోటిలోకి వెళ్లిన వెంటనే గొంతు కండరాలు అకస్మాత్తుగా సంకోచిస్తాయి. ఇది శ్వాసకోశం, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
/rtv/media/media_files/2025/05/04/ice7-750389.jpeg)
శరీర ఉష్ణోగ్రత ఒకే సారిగా తగ్గిపోవడం వల్ల తలతిరుగుడు, వాంతులు, తల నొప్పులు కూడా వస్తాయి. మైగ్రేన్‌తో బాధపడేవారికి బ్రెయిన్ ఫ్రీజ్ వంటి తీవ్రమైన తలనొప్పులు రావచ్చు. ఐస్ చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది.
/rtv/media/media_files/2025/05/04/ice10-436145.jpeg)
కొంతమందిలో చర్మం సున్నితంగా ఉండటం వల్ల ఐస్‌ను నేరుగా అప్లై చేయడం వల్ల వాపులు, అలర్జీలు రావచ్చు. ముఖ్యంగా ముఖం లేదా పెదవులపై ఐస్ ఎక్కువసేపు ఉంచడం వల్ల చర్మం పగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా అధికంగా ఐస్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.
/rtv/media/media_files/2025/05/04/ice4-400428.jpeg)
ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులను కలిగిస్తుంది. వేసవిలో చల్లదనం కోసం ఐస్‌ను నేరుగా నోటిలో పెట్టుకోవడం మంచిది కాదు. బదులుగా గోరువెచ్చని లేదా సహజ చల్లదనంతో కూడిన ద్రవాలు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
/rtv/media/media_files/2025/05/04/ice9-458972.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.