భూమి ఇప్పటికే ఏడు ఖండాలు, ఐదు మహాసముద్రాలుగా విభజించబడింది. మధ్యలో మరో ఖండం, సముద్రం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు. అవును మీరు విన్నది నిజం..! ఆఫ్రికా ఖండంలో చోటుచేసుకుంటున్న మార్పులను బట్టి.. కొత్తగా సముద్రాలు ఏర్పడటంతో పాటు, ఆఫ్రికా రెండుగా చీలిపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మరో సముద్రం..
ఆఫ్రికాలోని చీలికకు 700 కిలోమీటర్ల దూరంలో రింగ్‌వుడైట్ అని పిలువబడే నీలి రాతి నిర్మాణంలో చిక్కుకున్న మరొక మహాసముద్రం కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికే.. టెక్టోనిక్ ప్లేట్‌ల మధ్య భూమి కదలికలు నిరంతరం జరుగుతున్నట్టు GPS ట్రాకింగ్ సూచిస్తుంది. అరేబియా ప్లేట్ ఆఫ్రికా నుండి సంవత్సరానికి ఒక అంగుళం చొప్పున దూరంగా కదులుతోందట.