/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-10-25-11-38-49.jpg)
Nagula Chavithi
Nagula Chavithi: కార్తీక మాసం(Month of Kartika) శుక్ల పక్షం తిథి రోజు నాగుల చవితి పండుగ వస్తుంది. ఈ రోజున నాగులను పూజించడం, వాటికి పాలు పోయడం ద్వారా కుటుంబంలోని సుఖశాంతులు, సంతాన సౌభాగ్యం, వ్యాధి భయాలు, సర్పదోషాల నివారణ లభిస్తాయని భక్తులు నమ్ముతారు. నాగులు హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి.
నాగుల చవితి రోజు పాలు పోసే విధానం: పాము పుట్టలో కొద్దిగ పాలను పోసి, మిగిలిన పాలను నైవేద్యంగా భగవంతుని పూజకు సమర్పిస్తారు. “దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనే శాస్త్ర వాక్యంతో, పాములు పాలు తాగుతాయనే అపోహను తొలగిస్తూ, భక్తులకు ఆనందం, శాంతి లభిస్తుందని అర్థంతో ఈ మంత్రాన్ని జపిస్తారు. పాలు శుద్ధి, శాంతికి ప్రతీక. పంచామృతంలో పాల, పెరుగు, నెయ్యి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాలు, పెరుగుతో వివేకం, సుఖం, సమాజ సహకారం, త్యాగం, భోగం వంటి సద్గుణాలను పొందవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
పాముకు పాలు ఇచ్చేటప్పుడు చిన్నపిల్లలు చెప్పే మంత్రం..
‘నడుము తొక్కితే నావాడు అనుకో.. పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో. తోక తొక్కితే తోటి వాడు అనుకో. నా కంట నువ్వుపడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.’ ఈ మంత్రం ద్వారా పిల్లలకు సహనము, క్షమాపణ, ప్రకృతిని గౌరవించడం నేర్పిస్తారు.
రైతులు పంటలకు రక్షణ కోసం కూడా ఈ రోజున నాగులను పూజిస్తారు. పంటల పరిరక్షణ, భూమికి సారం, పశువుల, పక్షుల రక్షణకు ఇది ఒక ముఖ్య నమ్మకంగా భావిస్తారు. పామును పూజించడం ద్వారా కాలసర్ప, కుజదోషాలు తొలగుతాయని, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని విశ్వాసం.
పండు, బియ్యం, రవ్వ, పిండి చుట్టూ జల్లడం చిన్న జీవులకు ఆహారంగా ఇవ్వడం, చెవులకు మట్టి పెట్టడం వంటి ఆచారాలు కూడా జరుగుతాయి. ఇవి భక్తులుగా ప్రకృతిని, చిన్న జీవులను గౌరవిస్తూ జీవించాలన్న సందేశాన్ని ఇస్తాయి. నాగుల చవితి పూజ ద్వారా మనం కుటుంబం, ప్రకృతి, సంతానం, ఆరోగ్యం, పంటల రక్షణతో పాటు మనలో ఉన్న మంచితనాన్ని, క్షమాసక్తిని పెంపొందించుకోవచ్చని విశ్వాసం ఉంది.
Follow Us