Menopause: మెనోపాజ్ అనేది కొంతకాలం తర్వాత ప్రతీ స్త్రీలో కనిపించే ఒక సాధారణ విషయం. స్త్రీ అండాశయాలలో హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోయినప్పుడు రుతువిరతి వస్తుంది. సహజంగా ఇది 50 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. అయితే మెనోపాజ్ సమయంలో మహిళలు శారీరక మార్పులతో పాటు అనేక మానసిక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక సమస్యలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం మెనోపాజ్ సమయంలో చాలా మంది మహిళలు ఒత్తిడి, ఆందోళనను, కోపం, చిరాకు, ఆందోళన, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అనియంత్రిత భావోద్వేగాలు, మూడ్ స్వింగ్స్, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటి మానసిక ఇబ్బందులను ఎదుర్కుంటారు. మెనోపాజ్ టైంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మహిళల్లో బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలు అభివృద్ధి చెందుతాయి. ఇవి చిరాకు, డిప్రెషన్, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలకు కారణమవుతాయి.
Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే
మెనోపాజ్ సమస్యలను ఎలా అధికమించాలి?
- శరీరంలో హార్మోన్ల మార్పు కారణంగా బలహీనత, అలసట, ఒత్తిడి పెరగడం మొదలవుతుంది. ఈ మానసిక పరిస్థితులను అధికమించడానికి ఆహారం, జీవన శైలి అలవాట్ల పై ప్రత్యేక శద్ధ వహించాలి. డైట్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇది ఆందోళన, నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది.
- మెనోపాజ్ సమయంలో ఒత్తిడి, ఆందోళనగా అనిపిస్తే.. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం కోసం కాస్త సమయం కేటాయించండి. రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మానసిక శారీరక, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ఒంటరితనం, ఆందోళన మెనోపాజ్ డిప్రెషన్ కు కారణమవుతుంది. ఇలాంటి సమయంలో స్నేహితులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే ఒంటరిగా ఉన్నామనే భావన కలగదు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్