MDNIY Y-బ్రేక్ కోర్సుకు ప్రశంస పత్రం.. ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా

MDNIY యోగా బ్రేక్ ప్రోగ్రామ్ ద్వారా 800,000 ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా కేంద్ర సిబ్బంది,  శిక్షణ శాఖ (DoPT) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మొరార్జీ దేశాయ్ యోగా ఇన్‌స్టిట్యూట్ ఉత్తమ పనితీరుకు  ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

New Update
MDNIY

MDNIY

MDNIY: యోగా అనేది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఓ అద్భుతమైన సాధనం. శారీరక, మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు యోగా ఆధ్యాత్మిక మేల్కొలుపును కూడా అందిస్తుంది. ప్రజల్లో ఈ సంపూర్ణ అభివృద్ధి  లక్ష్యంగా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) స్థాపించబడింది. కాగా, పనివాతావరణంలో ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ సంస్థ అమలు చేసిన యోగా బ్రేక్ ప్రోగ్రామ్ ఎంతో విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ యోగా బ్రేక్ ప్రోగ్రామ్ 800,000 ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా కేంద్ర సిబ్బంది,  శిక్షణ శాఖ (DoPT) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మొరార్జీ దేశాయ్ యోగా ఇన్‌స్టిట్యూట్ ఉత్తమ పనితీరుకు  ప్రశంసా పత్రాన్ని అందజేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నేషనల్ లెర్నింగ్ వీక్- కర్మయోగి సప్తాహ్ వేడుకలో MDNIY డైరెక్టర్ డాక్టర్ కాశీనాథ్ సమగండి ఈ అవార్డును అందుకున్నారు. 

MDNIY4

MDNIY Y-బ్రేక్ కోర్సు

MDNIY Y-బ్రేక్ కోర్సు (iGOT ) భారత్ లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన  యోగా ప్రోగ్రామ్‌గా ఉద్భవించింది. ఇప్పటికే  868,094 కంటే ఎక్కువ మంది ప్రభుత్వ అధికారులు ఈ కోర్సును పూర్తి చేసారు. అలాగే ఎంతో మంది నిపుణులు, ఉద్యోగులు ఈ యోగ ప్రోగ్రామ్ ద్వారా కలిగే అనేక ఆరోగ్య  ప్రయోజనాలను తెలియజేశారు. 

పనివాతావరణంలో ఒత్తిడి

MDNIY ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన ఈ Y-బ్రేక్ కోర్సు ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పని నుంచి కాస్త విరామం తీసుకొని.. Y-బ్రేక్ కోర్సులో పాల్గొనడం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మళ్ళీ పని పై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఈ యోగా బ్రేక్ కేవలం 5-6 నిమిషాల సెషన్ మాత్రమే.. కానీ క్రమం తప్పకుండా దీనిని పాటించడం వల్ల ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో సాధారణ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు అలాగే వర్క్‌స్టేషన్‌లో సాధన చేయగల యోగాసనాలు ఉంటాయి. Y-బ్రేక్ పనివాతావరణంలో ఒత్తిడిని తగ్గించడానికి, రిఫ్రెష్ చేయడానికి,  తిరిగి దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. 

ఈ ఈవెంట్ లో వై-బ్రేక్ ప్రోగామ్ పై డైరెక్టర్ సమగండి మాట్లాడుతూ.. యోగా బ్రేక్ కోర్స్ ప్రోగ్రామ్ అద్భుతమైన విజయం దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధికారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. iGOT కర్మయోగి ప్లాట్‌ఫారమ్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని,  ప్రభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు. 

Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు