వేల కిలోమీటర్లు ప్రయాణించిన బిర్యాని.. హైదరాబాద్ లో బెస్ట్ మండి స్పాట్ ఎక్కడ?

హైదరాబాద్ లో బిర్యానీతో పాటు మండి కూడా ఇక్కడి పాపులర్ ఫుడ్ ఐటమ్స్ లో ఒకటిగా మారిపోయింది. అసలు ఈ మండి వెనుక కథేంటి..? ఇది ఎలా వచ్చింది..? జనాల్లో ఎందుకు ఇంతలా పాపులర్ అయ్యింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

mandi (1)

mandi Biryani

New Update

Mandi: మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన భోజనం ఇప్పుడు అందరి ఫేవరేట్ గా మారిపోయింది. ఫ్రెండ్స్ గ్యాంగ్.. ఎక్కడికైనా వెళ్దామా? అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇదే. ఫ్యామిలీ గేట్ టూ గెదర్స్ అంటే చిన్నా,పెద్దా అందరికీ సులభంగా నచ్చే ఫుడ్  ఇదే. కపుల్స్ కి మురిసిపోయే లైట్స్,  మసాలా రుచి,  కూల్ అంబియెన్స్‌తో అద్భుతమైన డేటింగ్ ప్లేస్ కూడా. బిర్యానీతో పాటు హైదరాబాద్ లో ప్రత్యేక ఆహారాల్లో ఒకటిగా మారిపోయిన ఈ పాపులర్ ఫుడ్ పేరు 'మండి . అసలు ఈ మండి వెనుక కథేంటి..? ఇది ఎలా వచ్చింది..? జనాల్లో ఎందుకు ఇంతలా పాపులర్ అయ్యింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

మండి అంటే ఏమిటి?

'మండి' యెమన్ దేశానికి చెందిన ఒక ప్రత్యేక ఆహారం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఆహరం ప్రత్యేకమైన రుచితో పాటు మంచి పేరు తెచ్చుకుంది. మండిని బాస్మతి రైస్,  నెయ్యి లేదా ఆలివ్ అయిత్, మసాలాలు, మటన్ లేదా చికెన్ తో తయారు చేస్తారు. 

మండి పేరు వెనుక కథ 

మండి అనే పదం అరబ్బీ భాష నుంచి వచ్చింది. దీని అర్థం తక్కువ మసాలాలు, లేదా సున్నితమైన ఆవిరి అని చెబుతారు. అంటే తక్కువ ఘాటు,  మసాలాలు ఉంది మాంసం, రైస్ అసలైన రుచి బయటపడేలా ఉంటుంది.  

ఇండియాకి 'మండి' ప్రవేశం 

అయితే అప్పట్లో మిడిల్ ఈస్ట్ కి వెళ్లిన భారతీయ  కార్మికులు, ముఖ్యంగా కేరళ ప్రజలు, అక్కడి మండి రుచిని చూసారు. ఆ తర్వాత వారు తిరిగి స్వదేశానికి వచ్చేటప్పుడు తమతో పాటు మండిని తీసుకొచ్చారు. మొదట కేరళలో ప్రారంభమైన 'మండి' ట్రెండ్ ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి.. వన్ ఆఫ్ ది పాపులర్ ఫుడ్ ఐటమ్ గా మారింది.  

హైదరాబాద్ లో పాపులర్ మండి ప్లేసెస్ 

మండి@36: బంజారాహిల్స్, హైక్లాస్ అంబియెన్స్, మల్టిపుల్ వేరైటీస్.
బర్కాస్ మండి హబ్: బర్కాస్ ఏరియా అంటేనే మండి మిక్కిలి ప్రసిద్ధి.
అలైఫ్ రెస్ట్‌రెంట్: టోల్‌గేట్ సమీపంలో ఫ్యామిలీ మండి.
సఫా మండి: మీయాపూర్‌

పాపులర్ మండి రకాలులు

మటన్ మండి,  చికెన్ మండి,  కబ్సా, ఫిష్ మండి..  ప్రత్యేక రుచి కోసం ఈ కొత్త వేరైటీ ట్రై చేయవచ్చు. కబ్సా

మండి స్పెషాలిటీ 

మండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆవిరితో కుక్ చేస్తారు.అలాగే దీనిలో మసాలాలు తక్కువగా ఉండటంతో అందరికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా నేలమీద బరుస్తీల్ రైస్ ప్లేట్స్‌లో కూర్చుని తినడం ప్రత్యేక అనుభవం ఇస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: కీర్తిసురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు మరెవరో కాదు..!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe